Begin typing your search above and press return to search.

ఆచార్యలో మెగా డాటర్‌ పాత్ర ఇదేనట

By:  Tupaki Desk   |   27 April 2020 10:30 AM IST
ఆచార్యలో మెగా డాటర్‌ పాత్ర ఇదేనట
X
మెగాస్టార్‌ చిరంజీవి.. కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నిహారిక నటించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా చిరంజీవి దాదాపుగా కన్ఫర్మ్‌ చేశాడు. సురేఖకు నేను చరణ్‌ నటించాలని చాలా కాలంగా కోరిక ఉంది. ఆ కోరిక ఈ సినిమాతో తీరుతుందని ఆశిస్తున్నాను. రాజమౌళిని తమ సినిమా కోసం చరణ్‌ డేట్లు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశామని కూడా చిరు చెప్పిన విషయం తెల్సిందే. అలాగే తండ్రి కొడుకుల పాత్రలు కాకుండా గురు శిష్యుల మాదిరిగా తమ పాత్రలు ఉంటాయని కూడా చిరు ఆ మద్య చెప్పారు.

ఇక ఆచార్యలో నిహారిక పాత్ర విషయమై సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌ పుకారు షికారు చేస్తోంది. కథలో చరణ్‌ కు చెల్లి పాత్రలో నిహారిక కనిపించబోతుందట. చరణ్‌ కు సంబంధించిన స్టోరీని నిహారిక చిరంజీవి కి చెబుతుందట. అలాగే చరణ్‌ చనిపోవడంతో నిహారిక బాధ్యతను చిరంజీవి తీసుకుంటాడని కూడా అంటున్నారు. చిరంజీవి నిహారికల మద్య కాంబో సీన్స్‌ చాలా ఆసక్తికరంగా సెంటిమెంట్‌ తో కూడినవిగా ఉంటాయని కూడా చెబుతున్నారు.

సైరా చిత్రంలో కూడా నటించిన నిహారిక అందులో పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్రను దక్కించుకోలేక పోయింది. కాని ఈసారి మాత్రం చిరంజీవి ముఖ్యమైన పాత్రనే నిహారికకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే సినిమాను మళ్లీ ప్రారంభించబోతున్నారు. సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా ఆచార్య ఎప్పుడు వచ్చేది చెప్పలేని పరిస్థితి. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.