Begin typing your search above and press return to search.

వ‌య‌సుతో పనేం ఉంది PSPK క‌ళ్ల ముందుంటే!

By:  Tupaki Desk   |   10 Oct 2021 12:30 AM GMT
వ‌య‌సుతో పనేం ఉంది PSPK క‌ళ్ల ముందుంటే!
X
`స‌వ్య‌సాచి` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ముంబై బ్యూటీ నిధి అగ‌ర్వాల్. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌న‌ప్ప‌టికీ అటుపై `ఇస్మార్ట్ శంక‌ర్` లో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. దీంతో నిధి కెరీర్ కాస్త స్పీడ్ అందుకుంది. తెలుగు.. త‌మిళ్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. స్టార్ హీరోతో ఇదే తొలి అవ‌కాశం. ఇప్ప‌టి వ‌ర‌కూ నిధి అగ‌ర్వాల్ యంగ్ హీరోల స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిన‌దే.

తొలిసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న న‌టించ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ‌? అనే అంశం తెర‌మీద‌కి వ‌చ్చింది. ప‌వ‌న్ వ‌య‌సులో సగం వ‌య‌సు నిధికి ఉంటుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి 50 ఏళ్లు కాగా.. నిధిగా అగ‌ర్వాల్ కి 28 సంవ‌త్స‌రాలు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఇంత వ‌య‌సు వ్య‌త్యాసం అంటూ మీడియాలో టాక్ న‌డుస్తోంది. ఇదే విష‌యాన్ని నిధి అగ‌ర్వాల్ ముందుకు ఓ ఇంట‌ర్వ్యూలో తీసుకెళ్తే.. ప‌వ‌న్ తో న‌టించ‌డం అంటే 25 ఏళ్ల యువ‌కుడితో న‌టిస్తున్న‌ట్లు ఉంద‌ని నిధి తెలిపింది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్కౌట్ అవుతుంది. ఆన్ స్క్రీన్ పై ప‌ర్ పెక్ట్ జోడీగా క‌నిపిస్తామ‌ని అంటోంది.

ఇక `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ` ఓ పీరియాడిక్ చిత్రం. ఇందులో నిధి పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉండ‌బోతోంద‌ట‌. యువ‌రాణి పాత్ర‌లో నిధి క‌నిపించ‌నుంది. ఈ పాత్ర కోసం చాలా క‌స‌ర‌త్తులు చేసింది. యువ‌రాణి ఆహార్యంలో ఒదిగిపోయి న‌టించింద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. భారీగా బంగారు వ‌జ్రాభ‌ర‌ణాలు.. ఖ‌రీదైన వ‌స్త్రాల్లో..చ‌క్క‌ని మేక‌ప్ తో యువ‌రాణినే త‌ల‌పిస్తోందిట‌. అయితే ఈ మేక‌ప్ కార‌ణంగా చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. వాష్ రూమ్ కి వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఆభ‌ర‌ణాలు అన్నింటిని తొల‌గించి మ‌ళ్లీ వాటిని ధ‌రించ‌డం...మేక‌ప్ చెరిగిపోవ‌డం..తిరిగి చీర‌లు క‌ట్టుకోవ‌డం వంటివి ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌ని నిధి అగ‌ర్వాల్ తెలిపింది.