Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అందాల జాత‌ర‌

By:  Tupaki Desk   |   20 Oct 2021 9:45 AM GMT
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అందాల జాత‌ర‌
X
సోషల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానులకు ట‌చ్ లో ఉంటూ భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది నిధి అగ‌ర్వాల్. అభిమానుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే వ‌రుస‌గా క్రేజీ స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాల్ని అందుకుంటోంది. సాధ్య‌మైనంత ఎర్లీగానే స్టార్ డమ్ ని సాధించడం ఖాయం అని అర్థ‌మ‌వుతోంది. నిధి ఇటీవ‌ల‌ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త మైలురాయిని అధిగ‌మించింది. ఇన్ స్టాలో కోటి 30ల‌క్ష‌ల (13 మిలియన్) మంది ఫాలోవర్స్ ని సాధించింది.

ఈ సందర్భంగా లేటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిధి తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన గోధుమ రంగు దుస్తులను ధరించి క‌నిపించింది. ఈ డ్రెస్ లో ఒంపుసొంపుల్ని నిధి ఎంతో బ్యూటిఫుల్ గా ఆవిష్క‌రించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... నిధి అగ‌ర్వాల్ తదుపరి ప‌వ‌న్ క‌ల్యాణ్ `హరి హర వీర మల్లు` లో న‌టిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి నర్తకిగా నటిస్తోంది. మ‌రోవైపు మ‌హేష్ క‌జిన్ గ‌ల్లా అశోక్ స‌ర‌స‌న న‌టిస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ - ప‌ద్మ దంప‌తుల వార‌సుడు అశోక్ గల్లా హీరోగా ఆరంగేట్ర సినిమాలో నిధి గ్లామ‌ర‌స్ పాత్ర‌లో న‌టిస్తోంది. . ఈ సినిమాని సూప‌ర్ స్టార్ కృష్ణ‌-గ‌ల్లా అరుణ‌కుమారి స‌మ‌ర్ప‌ణ‌లో గ‌ల్లా పద్మావ‌తి నిర్మిస్తున్నారు. అమ‌ర్ రాజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లో మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.