Begin typing your search above and press return to search.
ఆ బ్యూటీకి బీఎఫ్ ఉన్నాడట. కానీ...!
By: Tupaki Desk | 8 July 2020 10:30 AM GMTపూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఇస్మార్ట్ గర్ల్ గా మారిపోయింది నిధి అగర్వాల్. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నామైఖెల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఫస్ట్ సినిమాలో అందాలు ఆరబోస్తూనే తన డాన్సులతో అదరగొట్టింది. ఐనా ఎందుకో బాలీవుడ్ లో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో అక్కడ లాభం లేదనుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా పరాజయం పాలైనా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత అఖిల్ అక్కినేని 'మిస్టర్ మజ్ను' చిత్రంలోనూ నటించింది నిధి. అయితే ఈ చిత్రం కూడా నిధికి నిరాశనే మిగిల్చింది.
ఈ క్రమంలో గతేడాది డేరింగ్ డైరెక్టర్ పూరీ డైరెక్షన్ లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించింది నిధి. ఈ సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో హీరోయిన్ గా తన అందంతో నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఓ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు జయం రవి సరసన 'భూమి' అనే తమిళ్ సినిమాలో నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న నిధి అగర్వాల్ ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం నైట్ ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చింది. అయితే నిధి కావాలని లైవ్ లోకి రాలేదని చెప్పుకొచ్చింది. ఎలాగూ వచ్చాను కదా అని ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించింది. అనుకోకుండా నేను నైట్ టైం ఎలా ఉంటానో అని మీకు తెలిసి పోయింది అని నవ్వేసింది. ఈ క్రమంలో 'మీకు బీఎఫ్ ఉన్నాడా' అని ఓ కొంటె నెటిజన్ ప్రశ్నించగా.. దీనికి ''ఉన్నాడు.. బీఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండే కదా..? ఒకవేళ బాయ్ ఫ్రెండ్ అయ్యుంటే మాత్రం లేడనే చెప్తాను'' అని తెలివిగా సమాధానంగా చెప్పింది నిధి. ఇక 'మిస్టర్ మజ్ను' సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ 2 డేస్ లో 30 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసినందుకు సంతోషం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కితే ఎగిరి గంతేస్తానని చెప్పింది. కరోనా సమయంలో అందరిని జాగ్రత్తగా ఉండమని సూచించింది.
పబ్జీ గేమ్ బాగా ఆడతానని.. నేను నాన్ వెజ్ తినకపోయినా చికెన్ డిన్నర్ గెలుస్తూనే ఉంటానని చెప్పింది. అయితే తన పబ్జీ ఐడీ చెప్పకుండా కొన్ని క్లూస్ ఇచ్చింది. అంతేకాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని.. ఆఫీసియల్ అనౌన్సమెంట్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పుకొచ్చింది. తన ఫెవరేట్ ప్లేస్ అని అడిగితే ఇల్లే అని చెప్తానని.. స్వయంగా తాను తయారు చేసిన కొన్ని డిజైన్స్ చూపించింది. ఇక ఇప్పటికే చాలా లేట్ అయింది.. నేను నిద్రపోయే టైం అయిందని లైవ్ సెషన్ క్లోజ్ చేసింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.