Begin typing your search above and press return to search.

పవన్‌ కు ఆమె ఇస్మార్ట్‌ జోడీ కాదు

By:  Tupaki Desk   |   22 Nov 2020 11:00 AM IST
పవన్‌ కు ఆమె ఇస్మార్ట్‌ జోడీ కాదు
X
సవ్యసాచి మరియు మిస్టర్‌ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా విజయంతో ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తుండగా తాజాగా పవన్‌ కళ్యాణ్‌.. క్రిష్‌ కాంబో మూవీలో ఈమెకు ఆఫర్‌ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తో పాటు ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ ను కూడా పవన్‌ కు జోడీగా క్రిష్‌ నటింపజేస్తున్నాడనే వార్తలు జోరుగా వస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్నాయి.

పవన్‌ కు జోడీగా నిధి అగర్వాల్‌ సరైన ఎంపిక కాదంటున్నారు. పవన్‌ ఫిజిక్‌ మరియు ఆమె ఫిజిక్‌ ఏమాత్రం సెట్‌ అవ్వదు అంటున్నారు. అలాగే వయసు విషయంలో కూడా ఇద్దరి మద్య ఎక్కువ తేడా అనిపిస్తుందని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరో సరసన నటించే అర్హత ఆమెకు లేదు అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. క్రిష్‌ ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటాడని తాము భావించడం లేదు అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ మూవీ ప్రారంభంకు ఇంకా సమయం పట్టనుంది. ఇప్పటి నుండే ప్రచారం జరుగుతున్నా కూడా అది ఎంత వరకు నిజం అనేది క్లారిటీ లేదు. క్రిష్‌ నుండి క్లారిటీ వచ్చేంత వరకు ఫ్యాన్స్‌ కాస్త ఓపిక పడితే బాగుంటుంది.