Begin typing your search above and press return to search.

బాత్ రూం కు వెళ్తున్నా వెంటాడుతూనే ఉంది

By:  Tupaki Desk   |   25 Dec 2020 1:00 PM IST
బాత్ రూం కు వెళ్తున్నా వెంటాడుతూనే ఉంది
X
సవ్యసాచి.. మిస్టర్‌ మజ్ను సినిమాల్లో అక్కినేని హీరోలతో నటించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో మొదటి కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత ఫొటోలు అలవాటు తన పెట్స్ కు సంబంధించిన వీడియోలను కూడా షేర్‌ చేస్తూ ఉంటుంది. నిధి అగర్వాల్‌ ఇటీవల తన పెట్‌ డాగ్ తో తనకు ఉన్న అనుబంధం గురించి షేర్‌ చేసింది.

తన పెట్‌ డాగ్‌ బాత్ రూంకు కూడా వెళ్లకుండా అడ్డు పడుతుంది. నేను బాత్‌ రూంకు వెళ్తున్న సమయంలో చాలా దీనంగా నన్ను చూస్తూ ఉంది. బాత్ రూం డోర్‌ వద్ద ధీనంగా ఉన్న ఆ పెట్ డాగ్‌ వీడియోను నిధి షేర్‌ చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌ అవుతుంది. నిధి అగర్వాల్‌ అంతటి అందగత్తెను ఆ పెట్ వదిలి ఉండలేక పోతుంది. అందుకే ఫాలో అవుతూనే ఉందని కొందరు కామెంట్స్ చేస్తే.. మిమ్ములను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేక పోతుందని మరి కొందరు అంటున్నారు. కొందరు ఫన్నీగా దానికి ఒక తోడు చూడండి మీ వెంట పడదు అంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు.