Begin typing your search above and press return to search.

సవ్యసాచి హీరోయిన్ నో చెప్పేసింది

By:  Tupaki Desk   |   8 Nov 2017 12:24 PM IST
సవ్యసాచి హీరోయిన్ నో చెప్పేసింది
X
ప్రస్తుత రోజుల్లో సినీ తారలు సినిమాల్లో నటించిన దానికంటే ఇతర కంపెనీలకు ప్రచారకర్తలుగా ఉంటూ ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు బడా కంపెనీలు వచ్చి కోట్లు ఆఫర్స్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలలో ఒక్కోసారి తారలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. తప్పుడు ప్రాడక్ట్ లకు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటున్నారని ఒక్కోసారి బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకుంటున్నారు. లీగల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు

దీంతో తారలు చాలా జాగ్రత్తగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలా లేదా అనే విషయాన్ని ఆలోచించుకొని మరి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఒక వేళ నచ్చకుంటే ఎన్ని కోట్లు అఫర్ చేసినా ఒప్పుకోవడం లేదు. రీసెంట్ గా మున్నా మైకేల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ కూడా తనకు వచ్చిన ఒక అఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఓ ప్రముఖ ఫెయిర్ నెస్ క్రీమ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరిందట. కానీ తనకు వారి ప్రచార వ్యవహార శైలి నచ్చక నో చెప్పేసిందట. ఆ బ్రాండ్ కోసం చాలామంది హీరోయిన్లు ఎగబడుతుంటే.. ఈ పిల్ల మాత్రం నో అనడం బాలీవుడ్ కు షాకిచ్చింది.

ప్రస్తుతం అమ్మడు తెలుగులో సవ్యాసాచి లో నటించడానికి రెడీ అయ్యింది. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిపుడే కెరీర్ కొంచెం ఊపందుకుంటున్న సమయంలో అలాంటి నెగిటివ్ ప్రచారాలను చేయకుంటేనే మంచిదని డైరెక్ట్ గా చేయనని నిధి వివరించిందట. ఇకపోతే ఈరోజు నుండి మొదలవుతున్న సవ్యసాచి షూటింగ్ కోసం అమ్మడు ఎక్సయిట్ అవుతోందట.