Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బార్బీ డాళ్ నిధి కల్లోలం

By:  Tupaki Desk   |   30 April 2021 7:30 AM GMT
ఫోటో స్టోరి: బార్బీ డాళ్ నిధి కల్లోలం
X
న‌వ‌త‌రం భామ‌ల్లో నిధి అగ‌ర్వాల్ అంద‌చందాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సినదేమీ లేదు. టైగ‌ర్ ష్రాఫ్‌ మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన ఈ బెంగ‌ళూరు బ్యూటీ.. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో అక్కినేని హీరోల‌తో తెరంగేట్రం చేసింది. నాగ‌చైత‌న్య‌- అఖిల్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. కానీ ఆశించిన విజ‌యం ద‌క్కలేదు. ఆ త‌ర్వాత రామ్ స‌ర‌స‌న ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది.

ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్ మూవీ `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో నిధి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ నిధి వ‌రుస ఫోటోషూట్లు అభిమానుల్లో ట్రెండింగ్ గా మారాయి. తాజాగా నిధి బార్బీ డాళ్ లుక్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది.

లైట్ పింక్ మిడ్డీ.. వంగ‌పువ్వు రంగు టాప్ తో నిధి కిల్ల‌ర్ లుక్ దుమారం రేపుతోంది. పింక్ బ్యాక్ గ్రౌండ్ కి నియ‌రెస్ట్ మ్యాచింగ్ డిజైన‌ర్ లుక్ లో నిధి అంద‌చందాలు ప‌దింత‌లు ఎలివేట్ ఆయ్యాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారుతున్నాయి.