Begin typing your search above and press return to search.

వీడియో: నిధి మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   15 April 2021 8:27 AM GMT
వీడియో: నిధి మామూలుగా లేదుగా
X
ఇస్మార్ట్ నిధి అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? ఈ అమ్మ‌డు గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ స‌ర్కిల్స్ నుంచి మిస్సింగ్ అంటూ అభిమానులు క‌ల‌త‌గా న‌ల‌త‌గా ఉన్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్ లోని హిస్టారిక‌ల్ మూవీ `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది అంటూ ప్ర‌చారం సాగినా దానిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో అస‌లు నిధి ఉందా లేదా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏది ఏమైనా కానీ నిధి మిస్సింగ్. అయితే ఈ భామ నిరంత‌ర‌ క్యాట్ వాక్ ల‌ను మాత్రం అభిమానులు మిస్ కావ‌డం లేదు. అలా ఇన్ స్టా వేదిక‌గా త‌ర‌చి చూస్తే నిధి అందాల క్యాట్ వాక్ లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ స్కై బ్లూ టెరీకాట‌న్ డ్రెస్ లో ప్ర‌త్య‌క్ష‌మై మెరుపులు మెరిపించింది. నిధి అలా క్యాట్ వాక్ చేస్తూ ఒక్క క‌న్నుగీటుతో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పెంచేసింది. అలా త‌ల‌నీలాలు గాల్లో ఎగిరిప‌డుతుంటే వాటిని స‌వ‌రిస్తూ ఓర‌గా చూస్తూ క‌న్ను గీటిన‌ నిధి అందం మామూలుగా లేదుగా! అంటూ కుర్రాళ్లు ఈ వీడియోపై కామెంట్లు గుప్పిస్తున్నారు.

త‌మిళంలో సెల్వ‌రాఘ‌వ‌న్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో నిధి ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్ రీఎంట్రీ గురించి.. అలాగే ఇత‌ర ప్రాజెక్టులకు సంబంధించిన స‌మాచారం వెల్ల‌డి కావాల్సి ఉంది.