Begin typing your search above and press return to search.

పసిడి అందాలతో పడగొట్టేస్తోందే!

By:  Tupaki Desk   |   6 March 2021 12:30 AM GMT
పసిడి అందాలతో పడగొట్టేస్తోందే!
X
అందం ఎప్పుడూ అమ్మాయిలతోనే ఉంటుంది .. అందమే వాళ్ల బలం - బలగం. అందం కారణంగానే వాళ్లు ఏది చేసినా అందంగా ఉంటుంది .. చూసేవాళ్లకు ఆనందంగా ఉంటుంది. అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఎడారిలో నడక ప్రయాణం కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది. చెర్రీ పండులాంటి పిల్ల చెంతనుంటే అడవి కూడా అందమైన ఉద్యానవనం మాదిరిగానే కనిపిస్తుంది. అమ్మాయిలు అందాన్ని గుప్పెట్లో దాచలేరు. కానీ ఆ అందం తెచ్చే కలలను మాత్రం అబ్బాయిలు దుప్పట్లో దాచగలరు.

అందానికి ఊరంత ఉదాహరణలు ఇవ్వలేం .. నిలువెత్తు నిదర్శనాలు చూపలేం. అలాంటప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నిధి అగర్వాల్ ఫొటో చూపించేయవచ్చు. ఈ మధ్య కుర్రాళ్లు కాస్త కునుకు తీస్తున్నారనే డౌట్ వచ్చినట్టుంది. అంతే .. ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో ఈ ఫొటోను వదిలింది. ఇక నింగిలోకి ఎన్నో చందమామలు వచ్చినా నేల చల్లబడదు .. ఎన్ని ఐస్ క్యూబ్స్ ను ఏకధాటిగా మింగేసినా మనసు చల్లబడదు. ఒక రోజు నిద్రపోకపోతే జాగరణ అంటారు. రోజూ నిద్రపట్టకపోతే ఏమంటారో నిధి అగర్వాల్ నే అడగాలి.

నిధి .. పేరుకు తగినట్టుగా అందాల నిధే. నేరేడుపండ్లలాంటి ఆ కళ్లు చూస్తుంటే కుర్రాళ్లకు కాలం ఎలా తెలుస్తుంది? మంత్రం వేసినట్టుగా వచ్చి పడుతున్న ఆ చూపులను తట్టుకుని మనసెలా నిలుస్తుంది? ఆ పెదాలు దాటే వసంతాలు వస్తాయని తెలిసిన తరువాత వయసెలా ఒంటరి పోరాటం చేస్తుంది? పసుపు .. వెన్న కలిపి చేసినట్టుగా కనిపిస్తున్న ఈ పిల్లను కళ్లప్పగించి అలా చూస్తుండిపోతాం .. పవన్ తో తను చేస్తున్న సినిమా వచ్చేవరకూ అంటున్నారు పిల్లగాళ్లు. ఆ సినిమా త్వరగా రావాలనీ .. ఇకపై కుర్రాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుని నిధి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని కోరుకుందాం.