Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: క్లీన్ బౌల్డ్ చేయ‌డంలో నిధి త‌ర‌వాతే

By:  Tupaki Desk   |   30 March 2021 1:30 AM GMT
ఫోటో స్టోరి: క్లీన్ బౌల్డ్ చేయ‌డంలో నిధి త‌ర‌వాతే
X
మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన బెంగ‌ళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ ఆ త‌ర్వాత అక్కినేని కాంపౌండ్ సినిమాల‌తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. నాగ‌చైత‌న్య - అఖిల్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించినా ఆశించిన ఆ ఒక్క హిట్టు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత రామ్ స‌ర‌స‌న ఇస్మార్ట్ శంక‌ర్ భారీ విజ‌యం సాధించాక కొంత గుర్తింపు ద‌క్కింది.

నిధి ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతున్నా అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. త‌మిళ ద‌ర్శ‌కుడు మాజిగు తిరుమేని.. వ‌కీల్ సాబ్ ఫేం ఆదిత్య శ్రీ‌రామ్ చిత్రాల్లోనూ న‌టించ‌నుంద‌ని ప్ర‌చార‌మవుతోంది. కానీ వాటికి సంబంధించిన ప్ర‌క‌న‌ట‌న‌లేవీ క‌నిపించ‌లేదు.

అయితే నిధి ఇటీవ‌ల అవార్డు వేడుక‌ల్లో మెరుపులు మెరిపించి మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇన్ స్టా వేదిక‌గా నిధి ఇస్మార్ట్ ట్రీట్ గురించి తెలిసిన‌దే. మ‌రిన్ని ఫోటోలు వీడియోల కోసం త‌న‌ని ఇన్ స్టా వేదిక‌గా అనుస‌రించ‌మ‌ని అడిగేస్తూ తాజాగా నిధి షేర్ చేసిన ఓ ఫోటో వైర‌ల్ గా మారింది.

నిధీ ఈ లుక్ సంథింగ్ హాట్ ఇస్మార్ట్..! అంటూ అభిమానులు ఈ ఫోటోని అంతే వైర‌ల్ చేస్తున్నారు. కోక ర‌వికెలో నిధి ఇస్మార్ట్ అందాలు కుర్ర‌కారును క్లీన్ బౌల్డ్ చేశాయంటే అతిశ‌యోక్తి కాదు. ఆ జెరీ మెరుపుల‌ అంచు ఫ్లోర‌ల్ శారీలో నిధి అందాలు మ‌త్తెక్కిస్తున్నాయి. ఇక ఇదే ఊపులో మాంచి హిట్టు కొట్టి ట్రాక్ లో ప‌డుతుందేమో చూడాలి.