Begin typing your search above and press return to search.

ఇంస్టాగ్రామ్ రీల్ వీడియోతో కిక్కిస్తున్న ఇస్మార్ట్ భామ!!

By:  Tupaki Desk   |   6 Jan 2021 6:00 PM IST
ఇంస్టాగ్రామ్ రీల్ వీడియోతో కిక్కిస్తున్న ఇస్మార్ట్ భామ!!
X
మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారింది ముంబై బ్యూటీ నిధి అగర్వాల్. బాలీవుడ్ హీరోయిన్ గా మున్నా మైకేల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు దృష్టిపెట్టింది. కానీ కొందరు హీరోయిన్లకి పరువాలతో పాటు అదృష్టం కొంతైనా కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో అదృష్టం అనేది కాస్త లేటేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిధి ఇప్పటివరకు చేసిన తెలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు రెండు కూడా ప్లాప్ అయ్యాయి. అయితే చివరిగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫస్ట్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది నిధి. ఈ సినిమాతో అమ్మడు గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ముఖ్యంగా పాటలలో నిధి అందాల ఆరబోత మాములుగా లేదు. అందుకే కుర్రకారు అలా ప్లాట్ అయిపోయారు.

ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ కలిగిన నిధి.. ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ భామ.. తాజాగా ఇంస్టాగ్రామ్ రీల్స్ లో తన వీడియో పోస్ట్ చేసింది. అంతే అభిమానులకు కన్నుల పండుగే అవుతుందని చెప్పాలి. తమిళ హీరో జయం రవితో కలిసి నటిస్తున్న భూమి సినిమాలోని మేకింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మోడరన్ డ్రెస్సులతో అమ్మడి అందాలు కనిపించి కనిపించినట్లు.. క్యూట్ ఎక్సప్రెషన్స్ ఊరిస్తున్నాయి. మరి కుర్ర హృదయాలు ఊరుకుంటాయా.. అలా కళ్లప్పగించి చూస్తున్నారంతే. అలాగే వీడియోకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది. హీరో శింబుతో ఈశ్వరన్ సినిమా చేసింది నిధి. ఆ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. అలాగే ప్రస్తుతం తెలుగులో అమ్మడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా ఎంట్రీ మూవీలో నటిస్తోంది.