Begin typing your search above and press return to search.

అందగత్తె చేతిలో అన్ని సినిమాలు ఉన్నాయా?

By:  Tupaki Desk   |   27 Sep 2021 11:30 PM GMT
అందగత్తె చేతిలో అన్ని సినిమాలు ఉన్నాయా?
X
నిధి అగర్వాల్ .. అందాల మందుపాత్ర .. మత్తెక్కించే మత్తు పాత్ర. కుర్రాళ్లంతా ఆమె కళ్లకి కనకాభిషేకాలు చేస్తుంటారు .. ఆమె చూపుల వాకిళ్లలో జాగారాలు చేస్తుంటారు. ఎద అందాలకు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చే ఈ పిల్ల .. పిలగాళ్లందరినీ తన ఇన్ స్టా చుట్టూ తిప్పుకుంటోంది .. ఫాలోవర్స్ జాబితాలో పొలోమంటూ వాళ్లంతా చేరేలా చేస్తోంది. ఈ బ్యూటీ సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ వచ్చేసరికి కుర్రాళ్లంతా బెంగపెట్టేసుకున్నారు. సోషల్ మీడియాలో కనిపించడం ఆలస్యమైతే తిట్టేసుకున్నారు. అంతలా తన అందచందాలతో ప్రభావితం చేస్తోంది.

తనని అంతగా ఆరాధిస్తున్న కుర్రాళ్లని ఇంతలా ఇబ్బంది పెట్టకూడదని అనుకుందేమో, మళ్లీ సోషల్ మీడియాలో తన దూకుడు పెంచింది. దాంతో పిలగాళ్ల ఫీవర్ తగ్గిపోయింది .. అలకను పక్కన పెట్టేసి అందరూ కూడా ఈ అందగత్తె చుట్టూ చేరిపోయారు. అయితే ప్రస్తుతం తాను తొమ్మిది సినిమాలకి డబ్బింగ్ చెబుతున్నాని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమకి తెలియకుండా .. కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా ఈ సుందరి ఇన్ని సినిమాలు ఎప్పుడు ఒప్పేసుకుంది? అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు.

తమకి తెలిసి ఆమె పవన్ సరసన 'హరిహర వీరమల్లు' సిసినిమా చేస్తోంది. ఇక మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. తమిళ సినిమాలు రెండు మూడు చేతిలో ఉండొచ్చు. కానీ ఈ తొమ్మిది సినిమాలు ఎక్కడివి? ఏ భాషలో చేస్తోంది? డబ్బింగ్ దశకు వచ్చేవరకూ వాటి తాలూకు అప్ డేట్లు ఎందుకు ఇవ్వలేదు? అని చాలా ఫీలైపోతున్నారు. బహుశా ఆ జాబితాలో కన్నడ .. హిందీ సినిమాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. మొత్తానికి తాను చాలా బిజీగా ఉన్నాననే విషయాన్ని మాత్రం ఒక్క పోస్టులో చెప్పేసింది.

ఈ అందగత్తె తెలుగులోకి అడుగు పెడుతూనే అక్కినేని ఫ్యామిలీ హీరోలతో వరుసగా రెండు సినిమాలు చేసింది. అయితే ఈ రెండు కూడా ఆమెకి అంతగా కలిసి రాలేదు. ఈ అమ్మాయిని స్విమ్మింగ్ పూల్ పక్కన చూపిస్తే ఇలాగే ఉంటుందని చెప్పేసి, 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో పూరి ఆమెతో బీచ్ లో సందడి చేయించాడు. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేశాడు. ఈ పిల్ల అందాలు దగ్గర నుంచి చూడటానికి సముద్రం కొంచెం ముందుకు వచ్చిందని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఈ సినిమా నుంచి ఈ అమ్మాయికి అవకాశాలు పెరుగుతూ పోతున్నాయి. మొత్తానికి వచ్చే ఏడాదిలో వరుస సినిమాలతో ఈ కుర్ర మందారం మిగతా హీరోయిన్లకు గట్టిపోటీ ఇవ్వబోతోందన్న మాట.