Begin typing your search above and press return to search.

ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు గొడుగు ప‌ట్టాలా నిధీ?

By:  Tupaki Desk   |   30 Aug 2021 2:30 PM GMT
ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు గొడుగు ప‌ట్టాలా నిధీ?
X
అందాల క‌థానాయిక నిధి అగర్వాల్ కెరీర్ ఒడిదుడుకుల గురించి తెలిసిందే. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నా ఆ తర్వాత కెరీర్ ప‌రంగా ఆశించినంత స్పీడ్ తో దూసుకెళ్ల‌లేక‌పోయింది.

కొంత గ్యాప్ త‌ర్వాత అగ్ర హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. ఇటీవ‌ల‌ ప‌వ‌న్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. నిధి లుక్ ని క్రిష్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. మహేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ స‌ర‌స‌న నిధి న‌టిస్తోంది. అటు త‌మిళంలోనూ నిధి అగ‌ర్వాల్ క‌థ‌లు వింటున్నార‌ని తెలిసింది. కానీ ఏవీ ఖ‌రారు కాలేదు.

మ‌రోవైపు నిధి సోష‌ల్ మీడియాల‌లో వ‌రుస ఫోటోషూట్ల‌తో హాట్ టాపిక్ గా మారుతోంది. నిధి అన్ లిమిటెడ్ గ్లామ‌ర్ షో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది. మ‌రోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ ఆ ఫోటోల‌ను ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న‌లో న‌టించేందుకు స్పాట్ కి వెళ్లిన నిధి వ‌ర్క్ ని వ‌ర్షం అడ్డుకుంది. ఆ క్ర‌మంలోనే త‌న‌కు గొడుగు ప‌డుతూ అసిస్టెంట్ త‌న‌వెంటే నిలిచాడు. ఆ స‌మ‌యంలో త‌న కొలీగ్స్ తో ఎంతో జోవియ‌ల్ గా క‌నిపించింది ఈ బ్యూటీ. అందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో పింక్ గులాబీ రంగు డిజైన‌ర్ డ్రెస్ లో నిధి త‌ళుక్కుమంది. అంత‌లోనే ప‌డ‌వ‌లాంటి ల‌గ్జ‌రీ కార్ లో స్పాట్ నుంచి మాయ‌మైంది.