Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః పెదాలు మాత్రమే చూపించి కవ్విస్తోంది

By:  Tupaki Desk   |   5 April 2021 6:30 AM GMT
ఫొటోటాక్‌ః పెదాలు మాత్రమే చూపించి కవ్విస్తోంది
X
చూడగానే కొరికి తినాలనిపించే స్ట్రాబెరీ పండ్ల మాదిరిగా ఉన్న ఈ పెదాలను చూస్తే ఎవరికైనా వావ్‌ అనిపించాల్సిందే. స్ట్రాబెరీ పండ్ల కంటే కూడా మరింత అందంగా ఉన్న పెదాలు ఎవరివో గుర్తు పట్టడం పెద్ద కష్టం ఏమీ కాదేమో. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కనిపించబోతుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అన్నట్లుగా ఉంటుందట. ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ అని. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. హాట్‌ ఫొటోలతో పాటు ఇంట్రెస్టింగ్‌ ఫొటోలను షేర్‌ చేసే ఇస్మార్ట్‌ బ్యూటీ ఈసారి ఈ స్ట్రాబెరీ లిప్స్‌ ను షేర్‌ చేసింది.

ముదురు ఎరుపు రంగు లిప్‌ స్టిక్‌ తో వావ్‌ అనిపించేలా ఉన్న పెదాలను షేర్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఇంత అందమైన పెదాలతో ముద్దు పెట్టించుకోవాలని ఉందంటూ కొందరు.. ఇంత అందమైన పెదాలు ఈ ప్రపంచంలోనే చూడలేదు అంటూ కొందరు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఫాలోవర్స్‌ ను రెచ్చగొట్టే విధంగా ఈ లిప్స్‌ షేరింగ్‌ ఏంటీ అంటూ మండి పడుతున్నారు. అందాల ఆరబోత చేస్తే ఎంతగా ఫొటో వైరల్‌ అవుతుందో ఇప్పుడు ఈ లిప్స్‌ పిక్‌ కూడా అంతకు మించి అన్నట్లుగా వైరల్‌ అవుతోంది. ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్ ఇన్‌ స్టా గ్రామ్‌ లో దాదాపుగా 7 మిలియన్‌ ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. కొన్ని గంటల్లోనే ఈ పెదాలకు 3.5 లక్షల మంది లైక్స్ కొట్టారు. కొన్ని వేల కొద్ది కామెంట్స్‌ వచ్చాయి.