Begin typing your search above and press return to search.

సవ్యాసాచి లో సెక్సీ నిధి!!

By:  Tupaki Desk   |   2 Oct 2017 6:57 AM GMT
సవ్యాసాచి లో సెక్సీ నిధి!!
X
ప్రేమమ్ - రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న చైతు కెరీర్ లో తొలిసారిగా హ్యాట్రిక్ కొడదామని యుద్ధం శరణం సినిమాను ఎంతో ఇష్టపడి తీశాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడంతో హ్యాట్రిక్ ఛాన్స్ ని మిస్ అయ్యాడు. నిర్మాత సాయి కొర్రపాటికి కూడా ఆ సినిమా ఏ మాత్రం లాబాలని ఇవ్వలేకపోయింది. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ రావాలని చూస్తున్నాడు.

ప్రేమమ్ సినిమాతో హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో సవ్యాసాచి అని సినిమాను తీస్తున్నాడు. కథానాయిక విషయంలో చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా చాలా కన్ఫ్యూజన్ లో ఉందట. అయితే రీసెంట్ గా ఒక బాలీవుడ్ భామను ఫైనల్ చేశారు. ఆమె ఎవరో కాదు టైగర్ ష్రాఫ్‌ తో మున్నా మైకేల్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన భామ నిధీ అగర్వాల్. అయితే ఆ సినిమా అమ్మడికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. తొలి సినిమానే డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా కథని ఎంపిక చేయడంలో కాస్త ఆలస్యమే చేసింది. కాకపోతే చిన్నదాని అందచందాలకు జనాలు ఫిదా అయిపోయారు. దాదాపు ఏ పబ్లిక్ ఈవెంట్లోనైనా కూడా ఈమె తన క్లీవేజ్ షోతో మతి పోగొట్టేస్తోంది. అందుకే అంత ఫాలోయింగ్ వచ్చేసింది అమ్మడికి.

రీసెంట్ గా దర్శకుడు చందు మొండేటి చెప్పిన కథను ఈ సెక్సీ బ్యూటి ఒకే చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకం కానుందని టాక్. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మూడవ వారంలో మొదలవ్వనుంది. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.