Begin typing your search above and press return to search.

చైతూ హీరోయిన్ చంపేసిందిగా..

By:  Tupaki Desk   |   3 Dec 2017 11:30 AM GMT
చైతూ హీరోయిన్ చంపేసిందిగా..
X
నిధి అగర్వాల్.. ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేయబోతున్న బాలీవుడ్ భామ. ముంబయిలో తాజాగా నిర్వహించిన ‘ఫిలిం ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్’ అవార్డుల కార్యక్రమంలో ఈ అమ్మాయి తన అందాల ప్రదర్శనతో అందరి మతి పోగొట్టేసింది. క్లేవేజ్ అందాల్ని ఎలివేట్ చేసే డ్రెస్సులో ఈ కార్యక్రమానికి హాజరైన నిధి.. పదే పదే తన గౌనును సర్దుకుంటూ మరింతగా ఆ అందాలు చూపరుల దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఆమె వేసుకుని డిజైనర్ డ్రెస్ టాక్ ఆఫ్ ద షో అయింది. హీరోయిన్లు అందాల్ని మరీ ఎక్కువ ఎక్స్ పోజ్ చేసే డ్రెస్ వేసుకున్నపుడు ఎక్కడ మరీ హద్దులు దాటుతున్నామో అని.. డ్రెస్ సర్దుకోవడం మామూలే. ఐతే అలాంటి సర్దుబాట్లు పక్కనుండి చేసుకోవాలి. కానీ నిధి మాత్రం కెమెరాల ముందుకొచ్చి వాటి ముందే టాప్ సర్దుకోవడంతో మరింతగా క్లీవేజ్ అందాలపై జనాల దృష్టి మళ్లింది. ఇండస్ట్రీకి కొత్త కాబట్టి ఇలాంటివి అమ్మడికి అలవాటు లేదేమో.

తాను ప్రస్తుతం తెలుగులో చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ చేస్తున్న విషయాన్ని నిధి ఆ ప్రెస్ మీట్లో వెల్లడించడం విశేషం. నిధి బాలీవుడ్లో చేసిన తొలి సినిమా ‘మున్నా మైకేల్’ అట్టర్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఆమె ఆశలన్నీ ‘సవ్యసాచి’ మీదే ఉన్నాయి.