Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు సస్పెన్స్‌ రివీల్ చేసిన అందాల నిధి

By:  Tupaki Desk   |   11 Jan 2022 3:30 PM GMT
హరిహర వీరమల్లు సస్పెన్స్‌ రివీల్ చేసిన అందాల నిధి
X
పవన్ కళ్యాణ్‌ వరుసగా సినిమాలు కమిట్‌ అవుతున్న నేపథ్యంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు వస్తాయని అభిమానులు ఎదురు చూస్తుండగా కరోనా వల్ల అంచనాలు తలకిందులు అయ్యాయి. పవన్ సినిమాలను చేసేందుకు సిద్ధంగా ఉన్నా కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వకీల్‌ సాబ్ తర్వాత భీమ్లా నాయక్ సినిమా తో పవన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా కూడా పెద్ద సినిమాల కోసం వాయిదా వేశారు. ఇప్పుడు ఆ పెద్ద సినిమాలు రావడం లేదు.. భీమ్లా నాయక్ విడుదల అవ్వడం లేదు. భీమ్లా నాయక్‌ తర్వాత పవన్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో సినిమా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు.

ఈ సినిమా పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న విషయం తెల్సిందే. అయితే ఈమద్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు పీరియాడిక్ మరియు ప్రస్తుత టైమ్‌ లైన్ లో నడవడం చూశాం. ఈ సినిమా కూడా అలాంటిదేనా అనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ ను సినిమా మొత్తం ఒకే తరహా పాత్రలో చూస్తామా లేదా టైమ్ పీరియడ్స్ మారుతాయా అనే చర్చ జరుగుతున్న సమయంలో ఇదే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్‌ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని రివీల్‌ చేసింది. ఇప్పటి వరకు హరి హర వీరమల్లు సినిమా గురించి క్రిష్ కాని ఇతర యూనిట్‌ సభ్యులు కాని ఎలాంటి విషయాన్ని రివీల్‌ చేయలేదు. కాని నిధి అగర్వాల్‌ మాత్రం ఈ సినిమా రెండు టైమ్‌ జోన్‌ ల్లో నడుస్తుందనే కీలక విషయాన్ని రివీల్‌ చేసింది.

మహేష్‌ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ హీరోగా నటించి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హీరో' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్‌ ఈ విషయాన్ని రివీల్‌ చేయడం జరిగింది. పవన్‌ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కొత్తగా చూస్తారు. ఆయనతో వర్క్ చేయడం జీవితంలో మర్చిపోలేని విషయం. ఆయన చాలా పాజిటివ్‌ గా ప్రతి విషయంలో కూడా ఉంటారు. సినిమా ఫస్ట్‌ హాఫ్ పూర్తి అయ్యింది.. త్వరలోనే సెకండ్‌ హాఫ్‌ కూడా మొదలు అయ్యే అవకాశాలు కరోనా సహకరిస్తే ఉన్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సంక్రాంతికి హరి హర వీరమల్లు సినిమా విడుదల అవ్వాల్సింది. కాని కనీసం భీమ్లా నాయక్ సినిమా కూడా విడుదల అవ్వక పోవడం తో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో భీమ్లా నాయక్‌ మరియు హరి హర వీరమల్లు సినిమాలు విడుదల అవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ సినిమా ఉంది. అది ఈ ఏడాదిలో పట్టాలెక్కే అవకాశం ఉంది.