Begin typing your search above and press return to search.

చైతూ హీరోయిన్ ప్యాంటుపై జోకులే జోకులు

By:  Tupaki Desk   |   6 Jun 2018 10:15 AM GMT
చైతూ హీరోయిన్ ప్యాంటుపై జోకులే జోకులు
X
టాలీవుడ్ లో ప్రస్తుతం నార్త్ భామల ఎంట్రీ లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. బాలీవుడ్ కంటే ముందు టాలీవుడ్ లో ఒక హిట్ అందుకోవడం ఇంపార్టెంట్ అనే ఆలోచనతో వస్తున్నారు. కాస్త కథ నచ్చినా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు. సినిమా షూటింగ్ దశలో ఉండగానే సోషల్ మీడియాలో బాగా క్రేజ్ అందుకుంటున్నారు. ఇటీవల నిధి అగర్వాల్ తన అందంతో జనాలను బాగా ఆకట్టుకుంది.

అమ్మడు నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, మొన్నటి వరకు బాగానే కనిపించిన నిధి రీసెంట్ గా ఎవరు ఊహించని విధంగా కనిపించింది. ఆమె వేసుకున్న ప్యాంట్ చూసి అందరూ ట్రాల్స్ వేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా మీడియా కంట పడిన నిధి టోర్న్ జీన్స్ తో దర్శనమిచ్చింది. దాన్ని టోర్న్ జీన్స్ అనాలో లేక ఇంకేదైనా కొత్త పేరు ఉందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

చాలా డ్యామేజ్ అయినా ప్యాంట్ వేసుకోవడం ఏమిటని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి అమ్మడు ఈ తరహా డ్రెస్ ను ఎలా నచ్చి వేసుకుందో గాని మొత్తానికి అభిమానుల నుంచి మాత్రం నెగిటివ్ కామెంట్స్ అలందుకుంటుంది. ఇక సవ్యసాచి సినిమా ఎండింగ్ దశలో ఉంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో చైతు సూపర్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించనున్నాడు.