Begin typing your search above and press return to search.

క్లోజ‌ప్ లో నిధి కిల్లర్ హాట్ అందాలు

By:  Tupaki Desk   |   23 May 2021 7:33 AM GMT
క్లోజ‌ప్ లో నిధి కిల్లర్ హాట్ అందాలు
X
క‌రోనా సెకండ్ వేవ్ సెలబ్రిటీల బిజీ లైఫ్ కి చెక్ పెట్టేసిన సంగ‌తి తెలిసిందే. క‌థానాయిక‌లంద‌రికీ కావాల్సినంత తీరిక స‌మ‌యం చిక్కింది. ఈ తీరిక వేళ‌ల్లో సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తూ ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు.

ఇదే కోవ‌లో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్నారు. ఇంత‌కుముందే కంక‌ణాల చెవిలోలాకుల‌తో ఫోటోల‌ను నిధి షేర్ చేసింది. ఇప్పుడు అవే ఫోటోల‌ను జూమ్ చేసి మ‌రీ రిపీట్ చేస్తోంది. నిధి క్లోజ్ ఫోటోల‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి.

కెరీర్ ఆరంభమే గ్లామ‌ర‌స్ నాయిక‌గా పేరు తెచ్చుకున్న నిధి అగ‌ర్వాల్ ఇప్ప‌టికీ అదే ఇమేజ్ తో కొన‌సాగుతోంది. యువత‌రం హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ కెరీర్ బండి నడిపించేస్తోంది. ఇటీవ‌లే ప‌వ‌న్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. క‌నీసం ఈ ఆఫ‌ర్ అయినా త‌న ఫేట్ మారుస్తుందేమో చూడాలి.