Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ బ్యూటీ నిధి గుబులు రేపే లుక్

By:  Tupaki Desk   |   9 Aug 2021 7:17 AM GMT
ఇస్మార్ట్ బ్యూటీ నిధి గుబులు రేపే లుక్
X
క‌రోనా క్రైసిస్ కాలంలో నిధి అగ‌ర్వాల్ సామాజిక సేవ గురించి తెలిసిన‌దే. `డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేక‌ర‌ణ సంస్థను ప్రారంభించి కోవిడ్-సంబంధిత అన్ని స‌హాయాల‌కు వ‌న్ -స్టాప్ గమ్యస్థానంతో సాయానికి ముందుకొచ్చింది. క‌రోనా రోగుల‌కు ప్రాథమిక అవసరాలైన‌ మందులు లేదా ఆహారం సాయం చేశారు.

ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు స్పందించిన నిధిపై ప్ర‌శంస‌లు కురిసాయి. మ‌రోవైపు నిధి అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్నారు. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో నిధి లుక్ మైమ‌రిపిస్తోంది. నిధి మోడ్ర‌న్ దేవ‌తకు సింబాలిక్ గా క‌నిపిస్తోంది. ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ టాప్ కి కాంబినేష‌న్ గా వంగ‌పువ్వు రంగు హుడీ కోట్ ని ధ‌రించింది. ఇక బాట‌మ్ లో డెనిమ్ నిక్క‌రుతో ఒక్క‌సారిగా హీట్ పెంచింది. బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన హాటెస్ట్ గాళ్ గా నిధి స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. గ్లామ‌ర‌స్ యాంగిల్ ని ఎలివేట్ చేయ‌డంలో స్పెష‌లిస్ట్ అని మ‌రోసారి ప్రూవైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..ఇటీవ‌లే ప‌వ‌న్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. నిధి లుక్ ని క్రిష్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. మహేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ స‌ర‌స‌న నిధి న‌టిస్తోంది. అటు త‌మిళంలోనూ నిధి అగ‌ర్వాల్ క‌థ‌లు వింటున్నార‌ని తెలిసింది.