Begin typing your search above and press return to search.

జాగ్రత్త.. చైతూ హీరోయిన్‌ అందులో ట్రైన్డ్‌

By:  Tupaki Desk   |   30 Oct 2018 12:18 PM GMT
జాగ్రత్త.. చైతూ హీరోయిన్‌ అందులో ట్రైన్డ్‌
X
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొదటి సినిమా విడుదల కాకుండానే ఈమెకు పలు ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇన్నాళ్లు తన గ్లామర్‌ స్టిల్స్‌ తో సోషల్‌ మీడియాలో సందడి చేసిన నిధి అగర్వాల్‌ తాజాగా తానో మార్షల్‌ ఆర్ట్స్‌ స్టూడెంట్‌ ను అంటూ ప్రకటించింది.

ప్రొఫెషనల్‌ గా తాను మార్షల్‌ ఆర్ట్స్‌ ను నేర్చుకున్నట్లుగా నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది. అందుకే ఈమెతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా - హెరాస్మెంట్‌ చేసేందుకు ప్రయత్నించినా కూడా వారికే నష్టం. ఈమద్య కాలంలో హీరోయిన్స్‌ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య కాస్టింగ్‌ కౌచ్‌ మరియు లైంగిక వేదింపులు. ఈ రెండు కూడా తాను ఎదుర్కోలేదని, తాను టాలీవుడ్‌ లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోకుండా కెరీర్‌ ను సాగిస్తున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

సవ్యసాచి ప్రమోషన్‌ లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ.. మీటూ ఉద్యమానికి నేను పూర్తి మద్దతు చెబుతున్నాను. ఆడవారు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులు తగ్గాలని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు మర్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే తాను నేర్చుకున్నట్లుగా నిధి చెప్పుకొచ్చింది. సవ్యసాచి సక్సెస్‌ అయితే ఈ అమ్మడికి వరుసగా సినిమాల్లో ఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది.