Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ హీరోయిన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

By:  Tupaki Desk   |   19 Jan 2022 1:31 PM GMT
ప‌వ‌న్ హీరోయిన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం
X
`స‌వ్య‌సాచి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది అందాల సోయ‌గం నిధి అగ‌ర్వాల్‌. ఉస్తాద్‌, ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, స్టార్ హీరో మ‌హేష్ బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌య‌మైన `హీరో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది నిధి అగర్వాల్‌. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 15న విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది.

ఈ చిత్రంలో ఆమె న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు. నిధి అర్వాల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌యం అయిన ఈ మూవీలో నిధి త‌న గ్లామ‌ర్ తో పాటు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ మూవీతో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న నిధి ప్ర‌స్తుతం సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా మారింది. దీంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, సెల‌బ్రిటీలు నిధిని ప్ర‌శంస‌ల్లో ముంచేస్తున్నారు.

జ‌గ‌ప‌తిబాబు త‌న‌కు మ‌ళ్లీ హీరో కావాల‌నే కోరిక వుండ‌ని, కార‌ణం త‌ను మ‌ళ్లీ హీరో అయితే నిధితో క‌లిసి రొమాన్స్ చేయెచ్చ‌ని త‌న మ‌నసులో వున్న కోరిక‌ని బ‌య‌ట‌పెట్టారు. అంతే కాకుండా నిధి అందంగా వుండ‌ట‌మే కాకుండా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులని ఎట్రాక్ట్ చేసింద‌ని చెప్పుకొచ్చారు. మ‌రో న‌టుడు న‌రేష్ మాట్లాడుతూ నిధి అగ‌ర్వాల్ కున్న క్రేజ్ చూస్తుంటే త‌న‌కు మ‌రో జ‌న్మ‌లో ఆమెలా పుట్టాల‌ని వుంద‌న్నారు. నిధి అంటే సంప‌ద అని, ఆమె న‌టించిన ప్ర‌తి సినిమా స‌క్సెస్ సాధించిన నిర్మాత‌ల‌కు సంప‌ద‌ని అందిస్తోంద‌ని బ్ర‌హ్మాజీ పొగిడేశారు.

ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ సుబ్బు అనే పాత్ర‌లో న‌టించింది. ఈ పాత్ర‌ని ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె న‌ట‌న‌కు, గ్లామ‌ర్ కు ఫిదా అవుతున్నారు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ క్రేజ్ ని సొంతం చేసుకున్న నిధి ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క్రిష్ తెర‌కెక్కిస్తున్న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో న‌టిస్తోంది. 17వ శ‌తాబ్దంలో కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ మూవీపై హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ భారీ అంచనాలు పెట్టుకుంది.