Begin typing your search above and press return to search.

అక్కినేని వారి నిధి నిక్షేపం!?

By:  Tupaki Desk   |   4 Aug 2018 6:22 AM GMT
అక్కినేని వారి నిధి నిక్షేపం!?
X
అక్కినేని వారి నిధి నిక్షేపం చూశారా? అక్కినేని హీరోల‌కు ల‌క్కీ ఛామ్‌ గా మార‌బోతున్న క‌న్న‌డిగ నిక్షేపాన్ని క‌చ్ఛితంగా క‌నులారా వీక్షించి తీరాలి. ఇదంతా ఎవ‌రి గురించి అంటారా? ఇంకెవ‌రో యంగ్ & ట్యాలెంటెడ్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ గురించే.

ఈ అమ్మ‌డు న‌టించిన ఒక్క సినిమా అయినా రిలీజ్ కాలేదు. అప్పుడే టాలీవుడ్‌ లో దావ‌న‌లంలా పాపుల‌రైపోయింది. అక్కినేని హీరోయిన్‌ గా ఈ భామ పేరు ఇంటా బ‌య‌టా మార్మోగిపోతోంది. ఈ క‌న్న‌డ బేస్‌ మెంట్ బ్యూటీ ముందుగా బాలీవుడ్‌ లో అడుగుపెట్టి అటుపై టాలీవుడ్‌ కి బచాయిస్తోంది. ఇక్క‌డ అక్కినేని హీరో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న స‌వ్యసాచి చిత్రంలో న‌టించింది. ఆ సినిమా ఆన్ సెట్స్ చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే మ‌రో క్రేజీ అనౌన్స్‌ మెంట్. అక్కినేని బుల్ల‌బ్బాయి అఖిల్ స‌ర‌స‌న నిధికి ఛాన్సిచ్చార‌న్న వార్త‌తో ఎంతో మ్యాట‌ర్ ఉంటేనే కానీ, ఈ అవ‌కాశం ద‌క్క‌దు క‌దా! అని అంతా మాట్లాడుకున్నారు. కొలీగ్ హీరోయిన్స్ అయితే కాస్తంత కుళ్లుకున్నారు కూడా. ఏదైతేనేం ఇప్ప‌టికి అక్కినేని వారి నిధినిక్షేపం అన్న పాజిటివ్ నోట్ అందుకుంది ఈ క‌న్న‌డిగ‌. త‌దుప‌రి ఆ రెండు సినిమాల‌తో విజ‌యాలు అందుకుని కెరీర్ ప‌రంగా స్పీడ్ పెంచేస్తుందేమో చూడాలి.

అస‌లు నిధిలో ప్ర‌త్యేక‌త ఏంటి? టాలీవుడ్ హ‌గ్ చేసుకునేంత ఈ అమ్మ‌డిలో ఏం ఉంది? అని ప్ర‌శ్నిస్తే .. క‌చ్ఛితంగా దానికి ఆన్స‌ర్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యూట్ లుక్‌ - హాట్ అప్పీల్‌ - అంత‌కుమించి ప్ర‌తిభ‌లో మేటి అన్న టాక్ తెచ్చుకుంది ఈ అమ్మ‌డు. అందుకే మునుముందు తెలుగు సినిమాకి నిధి కావాల్సిందేన‌ని నాగార్జున & కాంపౌండ్ ఇలా అవ‌కాశాలిచ్చార‌న్న మాటా వినిపిస్తోంది. ఇక‌పోతే నిధి రెగ్యుల‌ర్‌గా ఇదిగో ఇలా సామాజిక మాధ్య‌మాల్ని ఠారెత్తిస్తూ అంత‌కంత‌కు వేడి పెంచుతుండ‌డం యూత్‌ లో చ‌ర్చ‌కొచ్చింది.