Begin typing your search above and press return to search.
కరోనా సాయానికి ముందుకొచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ...!
By: Tupaki Desk | 22 April 2020 3:00 PM GMTప్రపంచం మొత్తం కంటికి కనిపించని సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని విలవిలలాడి పోతున్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. మన తెలుగు రాష్టాల్లో కుడా పోటాపోటీ కేసులు.. మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు తెలియజేస్తూ వస్తున్నారు. కరోనా బాధితులను ఆదుకోడానికి రాజకీయ ప్రముఖుల నుండి సెలెబ్రెటీల దాకా అందరూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన తెలుగు సినిమా కార్మికులకు అండగా తామున్నామంటూ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి భారీగా విరాళాలు అందజేశారు. అయితే హీరోయిన్స్ మాత్రం ఆర్థిక సాయాన్ని ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హీరోయిన్ ప్రణీత ముందడుగు వేసి ఓ యాభై కుటుంబాలకు అండగా నిలవగా.. లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ - కాజల్ అగర్వాల్ - తమన్నా భాటియా కూడా ముందుకొచ్చి తమకు తోచిన విధంగా సహాయం అందించారు.
ఈ నేపథ్యంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా కరోనా సాయానికి తన వంతు చేయూత అందించింది. ఎంత విరాళం ఇచ్చిందో చెప్పకపోయినా పీఎం కేర్ ఫండ్.. వెల్ఫేర్ అఫ్ స్ట్రే డాగ్స్.. కరోనా క్రైసిస్ ఛారిటీ.. సీఎం రిలీఫ్ ఫండ్.. స్ఫూర్తి సంక్షేమ సేవా సంఘ్ మొదలైన వాటికి కంట్రిబ్యూట్ చేసినట్లు నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ''నేను ప్రతి ఒక్కరినీ విరాళం ఇవ్వమని ప్రోత్సహించాలనుకుంటున్నాను.. ఇది యావత్ ప్రపంచానికి చాలా కష్టమైన సమయం. అంతేకాకుండా ఒకరికొకరు జాలి చూపించుకుంటూ ఉదారంగా ఉండవలసిన సమయం.. ప్రేమతో జాగ్రత్త వహించండి'' అంటూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. విరాళాల వివరాలు చెప్పకపోయినప్పటికీ కరోనా బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చినందుకు అందరూ నిధిని అభినందిస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ సైతం ఆచితూచి అడుగేస్తున్న సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు నేనుసైతం అంటూ ముందుకొచ్చిన ఆమెను ఇండస్ట్రీ ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు. మరి నిన్న మొన్న ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ ని చూసైనా మిగతా హీరోయిన్స్ ముందుకొస్తారేమో చూడాలి.