Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ లుక్కుతో కూడా వయ్యారి చంపేసేలా ఉందిగా..!!

By:  Tupaki Desk   |   9 Jan 2021 12:30 PM GMT
ట్రెడిషనల్ లుక్కుతో కూడా వయ్యారి చంపేసేలా ఉందిగా..!!
X
ఫ్యాషన్ ఇండస్ట్రీలో అందమైన మోడల్స్ ఎంతోమంది ఉంటారు. కానీ అందంగా ఉన్నవారంతా హీరోయిన్లు అయిపోరు. ఎందుకంటే అందంతో పాటు టాలెంట్ కూడా ఉండాల్సిందే అని నిరూపించింది ముంబై బ్యూటీ నిధి అగర్వాల్. కానీ ఈ భామ చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలనే గోల్ పెట్టుకొని దాని పైనే ఫోకస్ పెట్టి ప్రస్తుతం సౌత్ యంగ్ హీరోయిన్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇండస్ట్రీలో అన్ని అనుకున్నట్లు జరగవుగా.. ఈ భామ వచ్చిరాగానే కెరీర్ ఓ రేంజిలో ఊహించుకుందట. కానీ అసలు చూస్తే అమ్మడికి హిట్స్ కరువై కెరీర్ లో ప్లాప్ మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. అమ్మడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగింది. అనుకున్నట్లుగానే మోడలింగ్ లో రాణించి సినిమా సినీ అవకాశాలు దక్కించుకుంది. 2017లో మున్నా మైకేల్ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ అయిపోయింది. ఆ వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది.

మొదటి అడుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెట్టింది. నాగచైతన్య సరసన సవ్యసాచి సినిమా చేసింది ఆ సినిమా ప్లాప్. ఆ తర్వాత అఖిల్ సరసన మిస్టర్ మజ్నులో నటించింది అది కూడా ప్లాప్. కానీ ఏం చేస్తాం.. పరువాలతో పాటు అదృష్టం కూడా కొంత కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో అదృష్టం అనేది లేదనే అనిపిస్తుంది. అయితే తెలుగులో గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి హిట్టును తన ఖాతాలో వేసుకుంది నిధి. ఈ సినిమాతో గ్లామర్ డోస్ ఒక్కసారిగా పెంచేసింది. ముఖ్యంగా జిల్లెలమ్మ జిట్టా.. ఉండిపో లాంటి పాటలలో ఆమె అందాల ఆరబోత మాములుగా లేదు. అందుకే కుర్రకారు అలా ప్లాట్ అయిపోయారు. ఇక సోషల్ మీడియాలో నిధి అందాలకు మాములు ఫాలోయింగ్ లేదు. ఈ భామ ఏ పోస్ట్ పెట్టినా మరోమారు ఆలోచన లేకుండా లైక్స్, షేర్స్ కొట్టేస్తారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నిధి తాజాగా ట్రేడిషనల్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. కుర్తా పైజమా లాంటి డ్రెస్ లో అమ్మడు స్మైలింగ్ పిక్ తెగ వైరల్ అవుతోంది. చూస్తే ఎవరైనా అలా ఫిదా అయిపోవాల్సిందే. ఇక తాజాగా నిధి నటించిన ఈశ్వరన్ తమిళ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.