Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ... మహేశ్ మూవీలో నిధి అగర్వాల్?

By:  Tupaki Desk   |   24 May 2021 11:30 PM GMT
త్రివిక్రమ్ ... మహేశ్ మూవీలో నిధి అగర్వాల్?
X
అందం లక్షణమే ఆకర్షించడం .. అలాంటి అందం అలుముకున్న అమ్మాయిలే హీరోయిన్లు. ఈ మధ్య కాలంలో తెరపై చూడగానే పిల్ల చందమామలా ఉందనిపించిన హీరోయిన్ నిధి అగర్వాల్. బ్రహ్మదేవుడు మురిసిపోతూ చేసినట్టుగా .. ముచ్చటపడి గీసినట్టుగా కనిపించే ఈ పిల్లను చూస్తే కలలు రానివారు ఎవరు? కలలు రావాలని పగటిపూట కూడా కునుకు తీయని వారెవరు? అంతగా ఈ అమ్మాయి తన సొగసులతో సెగలు పుట్టించింది .. వాళ్ల మనసు పాత్రల్లో మత్తుమందు దట్టించింది.

అలాంటి నిధి అగర్వాల్ కి తొలి రెండు సినిమాలు కూడా నిరాశనే కలిగించాయి .. చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయితే అదృష్టం కొద్దీ మూడో సినిమా 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయాన్ని అందుకుంది. ఒకసారి పైకి లేచిన రాకెట్ నైనా ఆపొచ్చునేమోగానీ, అందానికి అదృష్టం తోడైతే మాత్రం ఆపడం కష్టమే. అదే ఈ సుందరి విషయంలోను జరిగింది ... నేరుగా పవన్ కల్యాణ్ సినిమాలో ఆయన సరసన నాయికగా ఛాన్స్ కొట్టేసింది. 'హరి హర వీరమల్లు'లో కథానాయకుడి మనసును కాజేసే పాత్రలో నటిస్తోంది.

ఆ తరువాత ఆమె త్రివిక్రమ్ సినిమాలోను కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉంటుందట. ఒక కథనాయికగా పూజా హెగ్డేను ఖాయం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ఆమెను సంప్రదించారట .. ఆమె కుదరదని చెబితే మాత్రం ఆ ఛాన్స్ నిధి అగర్వాల్ కి దక్కడం ఖాయమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.