Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ద‌ండీగా నిధి నిక్షేపాలు

By:  Tupaki Desk   |   3 Nov 2019 1:30 AM GMT
ఫోటో స్టోరి: ద‌ండీగా నిధి నిక్షేపాలు
X
నిధి అగ‌ర్వాల్.. స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. `మున్నామైఖెల్‌` చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయింది. తొలి సినిమాలోనే అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయ్యింది. ఆ త‌ర్వాత `సవ్యసాచి` చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైన నిధి.. అఖిల్ స‌ర‌స‌న `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రంలోనూ న‌టించింది. అవి రెండూ నిరాశ‌ప‌రిచాయి. ఇటీవ‌లే పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన `ఇస్మార్ట్ శంకర్`లో న‌టించింది.

ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించినా నిధికి ఎందుక‌నో ఆశించినంత పేరు రాలేదు. జూనియ‌ర్ ఇలియానాగా పాపుల‌రైన న‌భా న‌టేష్ త‌న‌కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఒక ర‌కంగా పేరు మొత్తం టేకోవ‌ర్ చేసేసింది. దీంతో మ‌రోసారి నిధికి నిరాశ త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో ల‌క్ చెక్ చేసుకుంటోంది. అక్క‌డ జ‌యం ర‌వి న‌టిస్తున్న 25వ సినిమా జేఆర్ 25లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఈ సినిమా సాంగ్ షూట్ ఇటీవ‌ల జ‌రిగింది. స్పాట్ నుంచి ఓ ఫోటోని నిధి సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది. అలాగే నిధి లేటెస్ట్ ఫోటోషూట్ నుంచి ఓ ఫోటోని షేర్ చేసింది. ప‌సుపు రంగు స్లిట్ డ్రెస్ లో నిధి లుక్ వేడెక్కించింది. నిధి థై సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటో ప్ర‌స్తుతం అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌లే బులుగు కోక‌లో వీపు సొగ‌సును చూపిస్తూ ఉన్న ఫోటోతో మురిపించిన నిధి ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ పోటోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంది.