Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో మిస్స‌యి అంత‌ ప‌ని చేసిందా?

By:  Tupaki Desk   |   4 Nov 2020 12:10 PM GMT
లాక్ డౌన్ లో మిస్స‌యి అంత‌ ప‌ని చేసిందా?
X
లాక్ డౌన్ స‌మ‌యంలో చాలా మంది క‌థా‌నాయిక‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తాము ఏం చేస్తున్నారో చెప్పుకుని వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం పాకులాడారు. కానీ ఒక అమ్మ‌డు మాత్రం అస‌లు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు లేకుండా సైలెంటుగా ఉంది. అయితే ఇంత‌కీ ఇస్మార్ట్ బ్యూటీ నిధి ఈ సీజ‌న్ లో ఏమైంది? అన్న‌ది ఆరా తీస్తే.. చాలా ఆస‌క్తిక‌ర సంగతులే తెలిసాయి.

ఇటీవ‌ల నిధి అగర్వాల్ తన కొత్త ప్రాజెక్ట్ కోసం తమిళం నేర్చుకుంటున్నారట‌. తమిళ భాషలో తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవ‌డానికి నిధి గత ఆరు నెలలుగా ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటోంది. అందుకే ఇలా ఫిలిం స‌ర్కిల్స్ నుంచి మిస్స‌య్యింద‌ట‌.

భాష నేర్చుకుంటే ప్ర‌జ‌ల‌తో నేరుగా క‌మ్యూనికేట్ చేయ‌వ‌చ్చ‌ని షూటింగుల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుందని ఈ భామ వెల్ల‌డించింది. ఇప్ప‌టికి త‌మిళ‌ భాషలో మెరుగ్గా ఉన్నాను అని తెలిపింది నిధి. అలాగే లాక్ డౌన్ సమయంలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సు కోసం చేరాన‌ని కూడా నిధి ప్రకటించింది. అక్కినేని కాంపౌండ్ లో స‌వ్య‌సాచి- మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల్లో న‌టించినా అవి రెండూ డిజాస్ట‌ర్లు. ఆ త‌ర్వాత ఇస్మార్ట్ శంకర్ తో నిధి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. అయినా ఆ త‌ర్వాత మాత్రం కెరీర్ ప‌రంగా ఆశించిన రేంజుకు చేర‌లేక‌పోయింది.