Begin typing your search above and press return to search.

డ్యామిట్! విమానాశ్ర‌యంలో లేడీ డాన్ లా దిగింది!!

By:  Tupaki Desk   |   13 Oct 2020 10:50 AM GMT
డ్యామిట్! విమానాశ్ర‌యంలో లేడీ డాన్ లా దిగింది!!
X
అక్కినేని హీరోలు నాగ‌చైత‌న్య‌.. అఖిల్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించినా స‌రైన హిట్ అందుకోలేక‌పోయింది నిధి అగ‌ర్వాల్. ఆరంభం ఆశించిన‌ది ద‌క్క‌క‌పోయినా ఎన‌ర్జిటిక్ నిధి ట్యాలెంట్ ని టాలీవుడ్ గుర్తించి అవ‌కాశాలిచ్చింది. ముఖ్యంగా నిధిలో గ్లామ‌ర్ యాంగిల్ డ్యాన్సింగ్ స్కిల్ కి మెచ్చి పూరి జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ ఆఫ‌ర్ నే ఇచ్చారు. రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో నిధి కుదుట‌ప‌డింది.

ఆ త‌ర్వాత మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ స‌ర‌స‌న ఓ సినిమాకి క‌మిటైనా టైమ్ కలిసి రాలేదు. ఆ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ క్రైసిస్ లో ఆ మూవీ ఏమైందో స‌రైన స‌మాచారం లేదు. త‌మిళంలో `భూమి` అనే చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా మ‌హ‌మ్మారీ సంపులో ప‌డింది.

నిధి సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ గానే ఉంది. నిరంత‌రంగా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ట‌చ్ లో ఉంటోంది. నిధి హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో ఇదిగో ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది. బ్లాక్ థై స్లిట్ డిజైన‌ర్ డ్రెస్ లో నిధి ఇచ్చిన ఫోజు వైర‌ల్ గా మారింది. ఈ లుక్ చూడ‌గానే డామిట్ లేడీ డాన్ లా దిగింది. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో గుబులు రేపుతోంది అంటూ బోయ్స్ ఒకటే కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా తెలుగు సినిమాల‌కు క‌మిట‌వుతోంది. ఆ క్ర‌మంలోనే బెంగ‌ళూరు టు హైద‌రాబాద్ ఇటూ అటూ వృత్తిప‌ర‌మైన‌ షికార్లు చేస్తోంద‌ట‌.