Begin typing your search above and press return to search.
ఇప్పుడిక మిస్టర్ అండ్ మిసెస్ నిక్..!!
By: Tupaki Desk | 1 Dec 2018 5:38 PM GMTమిస్ ప్రియాంక చోప్రా కాస్తా ఇప్పుడు మిసెస్ అయింది. జోధ్ పూర్ నగరంలోని ఉమైద్ భవన్ ప్యాలెస్ హోటల్ లో కేథలిక్ క్రిస్టియన్ సంప్రదాయంలో నిక్ జోనాస్ - ప్రియాంక చోప్రాల వివాహం జరిగింది. ఇప్పటి వరకూ డేటింగూ గట్రా అన్నీ ఉన్నా ఇప్పుడు మాత్రం వాటన్నిటికి ఫుల్ స్టాప్ పడి లవర్స్ కాస్తా భార్యభర్తలయ్యారు.
ఈ క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన వివాహానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు.. ఇద్దరికీ రాల్ఫ్ లారెన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ రాల్ఫ్ లారెన్ స్పెషాలిటీ ఏంటంటే 2017 మెట్ గాలా ఈవెంట్ లో ఈ రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన దుస్తుల్లోనే తళుక్కుమని మెరిసి అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఇదిలా ఉంటే రేపు(ఆదివారం) హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకోబోతున్నారు.
నిక్ ప్రియాంక లు మొట్టమొదట 2016లో ట్విట్టర్ ద్వారా చాటింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2017 ఎకాడమీ అవార్డ్స్ ఫంక్షన్ లో ఇద్దరూ కలిశారు. ఇక ఆతర్వాత ఒకరికి ఒకరు నచ్చడంతో ఏడాది పాటు డేటింగ్ చేసి ఇప్పుడు ఒక్కటయ్యారు.
నిక్ - ప్రియాంకలు పెళ్ళి తర్వాత ఢిల్లీ లో ఒకసారి.. ముంబైలో ఒకసారి భారీస్థాయిలో రెండు సార్లు రిసెప్షన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ రిసెప్షన్లలో బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా వ్యాపార క్రీడా రంగానికి చెందిన పలువురు హాజరవుతారని సమాచారం.