Begin typing your search above and press return to search.

ప‌ది మందిని క‌నేందుకు ఓకే చెప్పిన నిక్

By:  Tupaki Desk   |   3 Feb 2021 7:16 AM GMT
ప‌ది మందిని క‌నేందుకు ఓకే చెప్పిన నిక్
X
నిక్ జోనాస్ తో ప‌ది మంది పిల్ల‌ల్ని క‌నాలుంద‌ని ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా. ఆ కోరిక నెర‌వేరేదానా? అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. కానీ త‌న ఆకాంక్ష నెర‌వేరే దిశ‌గానే అడుగులు ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

తన భార్య ప్రియాంక చోప్రాతో కలిసి పెద్ద కుటుంబం కావాలని యోచిస్తున్నట్లు అమెరికన్ పాప్ స్టార్ నిక్ జోనాస్ తెలిపారు. ఆల్మోస్ట్ ప‌దిమందిని క‌నేందుకు ఓకే చెప్పాడు. అతను ప్రియాంకను తన జీవితం అనే పజిల్ లో అతి ముఖ్యమైన భాగం అని కూడా అభివర్ణించాడు. ఇది ఒక అందమైన ప్రయాణం.. చాలా మందికి ఏమైనా జరుగుతుంది.. అని నిక్ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు.

ఇది ఒక ఫ‌జిల్. ఏదీ మీ నియంత్రణలో లేదు.. దేవుడు శాసిస్తాడు. మా పునాది బలంగా ఉంది.. ఆ అవకాశం గురించి వేచి చూస్తున్నాను. చాలా సంతోషిస్తున్నా.. అని నిక్ అన్నారు. పీసీ న‌టించిన వైట్ టైగ‌ర్ చిత్రాన్ని నిక్ ప్ర‌మోట్ చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టార్ గా ఎదిగేందుకు అత‌డి నుంచి అన్నివిధాలా స‌హ‌కారం ఉంది. ఆ ఇద్ద‌రూ విడిపోతున్నార‌ని ప్ర‌ముఖ ఆంగ్ల మ్యాగజైన్ రాసిన దుష్ఠ క‌థ‌నాన్ని ప్రాక్టిక‌ల్ గా తూట్లు పొడుస్తూ ఆద‌ర్శ దాంప‌త్యం సాగిస్తున్నారు.