Begin typing your search above and press return to search.

అమెరికా కోడ‌లికి హ‌బ్బీ ఊహించ‌ని గిఫ్ట్

By:  Tupaki Desk   |   26 Dec 2019 10:52 AM GMT
అమెరికా కోడ‌లికి హ‌బ్బీ ఊహించ‌ని గిఫ్ట్
X
అమెరికా కోడ‌లు.. అందాల క‌థానాయిక ప్రియాంక చోప్రా(పీసీ) పేరు ఇంటా బ‌య‌టా మార్మోగుతోంది. బాలీవుడ్- హాలీవుడ్ లో పీసీ తిరుగులేని హీరోయిన్ గా వెలుగుతోంది. దానికి తోడు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ని పెళ్లాడటం త‌న‌కు హాలీవుడ్ స‌ర్కిల్స్ లో పెద్ద‌ ప్లస్ అయ్యంద‌నే చెప్పాలి. పెళ్ల‌యి యేడాది దాటిన ఈ జంట ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. నిక్ కి అస‌లే క్రిస్మ‌స్ సెంటిమెంట్. దాంతో భార్య‌ను స‌ర్ ప్రైజ్ చేసేందుకు పెద్ద ప్లానే వేశాడు. అంతేనా.. ఫేమస్ బ్యాట్ మొబైల్ ఆకారంలోని ఉన్న కార్‌ ని నిక్ తన ముద్దుల భార్య ప్రియాంకాకు కానుక‌గా ఇచ్చి స‌ర్ ప్రైజ్ చేశారు.

ఆ మొబైల్ కారులో తన భర్తతో మంచు కొండ‌ల్లో విహారం చేసింది. ద‌ట్టంగా కురుస్తున్న‌ మంచును సైతం లెక్క చేయకుండా ఇష్టానుసారం ఆ కార్ పై చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసారు ఆ జంట. ఆ ఎంజాయ్ మెంట్ కి సంబంధించిన రేర్ మూవ్ మెంట్స్ ని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన నిక్ ఓ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది.

``నిక్ నవ్వు కంటే విలువైంది ఏముంటుంది`` అంటూ అందమైన క్యాప్షన్ ఒకటి ఇచ్చాడు నిక్. భార్య అంటే నిక్ కి ప్రాణం. ఏ పనినీ తనకి చెప్పకుండా చేయడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆమెతో చెప్పే నిర్ణయించుకుంటాడు. ప్రియాంక కూడా అంతే. నిక్ లేనిదే కాలు బయట పెట్టదు. నిక్ తనకంటే పదేళ్లు చిన్నవాడైనా అతనికివ్వాల్సినంత ఇంపార్టెంట్ ఇస్తుంది పీసీ. మొదట్లో అందరూ ఆ జంటను చూసి నవ్వుకున్నా.. ఇప్పుడు మాత్రం వాళ్ల అన్యోన్యత‌ను చూసి తెగ మెచ్చుకుంటున్నారు. చోప్రా హీరోయిన్ గానే కాదు.. నిక్ కి భార్యగానూ లక్కీయే అంటూ పొగిడేస్తున్నారు. అన్న‌ట్టు నిక్ జోనాస్ - పీసీ జంట‌పై ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ మ్యాగజైన్ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రికీ అస్స‌లు పొస‌గ‌డం లేద‌ని.. కాపుర‌లంలో క‌ల‌త‌లు పరాకాష్ట‌కు చేరుకున్నాయ‌ని భారీ క‌థ‌నం ప్ర‌చురించి సంచ‌ల‌నాల‌కు తెర తీసింది. అయితే అదంతా వ‌ట్టి అస‌త్య ప్ర‌చారం అని ప్రూవ్ చేస్తూ నిక్ - పీసీ జంట హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. లైఫ్ లో ప్ర‌తి ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్ ని ఆస్వాధిస్తోంది ఈ జంట‌.