Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పాపం ప‌సోడు నిండా మునిగాడు!

By:  Tupaki Desk   |   15 Jun 2021 3:30 AM GMT
ఫోటో స్టోరి: పాపం ప‌సోడు నిండా మునిగాడు!
X
పాపం ప‌సోడు నిండా మునిగాడు. అది కూడా భార్య ప్రేమ‌లో..! ప్రేమైక త‌న్మ‌య‌త్వంలో అత‌డు స్వ‌ర్గ‌పుటంచుల్ని తాకుతున్నాడు. అక్క‌డ ర‌సాస్వాధ‌న‌లు చేస్తున్నాడు. పీసీ అలియాస్ ప్రియాంక చోప్రాను పెళ్లాడింది మొద‌లు నిక్ జోనాస్ ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంతో రోమాంచితంగా ఆస్వాధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ క్ష‌ణం దానికి కొన‌సాగింపు మాత్ర‌మే.

త‌న భార్యామ‌ణి ప్రియాంక చోప్రా క‌ళ్ల ముందు లేక‌పోతే పాపం ప‌సోడైన నిక్ అస్స‌లు త‌ట్టుకోలేడు. ఆమెను మిస్స‌వుతున్నాను అనిపిస్తే చాలు జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోతాడు. మెమ‌రీ లేన్ లో హాయిగా రొమాంటిక్ మూడ్ తో ఉన్న‌ ఫోటోల‌ను చూస్తాడు. వాటిని అభిమానుల కోసం షేర్ చేస్తాడు.

పీసీ ప్ర‌స్తుతం `సిటాడెల్` సిరీస్‌ చిత్రీకరణ కోసం లండన్ లో ఉన్నారు. దీంతో త‌న‌ను మిస్స‌వుతున్నాడు నిక్. అందుకే అతను ఆమెకు ఒక తీపి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ను అంకితమిచ్చాడు. నిక్ ఇపుడు లాస్ ఏంజెలెస్ లో ఉన్నారు. ఇక తాజా ఫోటోలో ఒకరి కళ్ళలోకి ఒక‌రు ప్రేమగా చూస్తూ.. సన్నిహితమైన క్షణం ఎంతో ఉద్వేగ‌భ‌రిత‌మైన‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్రియాంక చోప్రా నీలిరంగు చీర ధరించి దానిపై తెల్లటి పూల డిజైన్ తో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. చేతికి వెండి గాజులు ధరించింది... నిక్ జోనాస్ తెల్లటి స్వెట‌ర్ నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడు. ఒక మంచం మీద కూర్చుని ఉండ‌గా వారి కుక్క గినో ఆ పక్కన పడుకుంది. ప్రేమ జంట పూర్తిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.