Begin typing your search above and press return to search.

టీజర్ టాక్‌: అర్జున్ 150వ చిత్రం

By:  Tupaki Desk   |   16 May 2017 11:46 AM IST
టీజర్ టాక్‌: అర్జున్ 150వ చిత్రం
X
తెలుగు తమిళ్ రెండు భాషలో మంచి మార్కెట్ ఉన్న నటుల లిస్ట్ లో యాక్షన్ హీరో అర్జున్ తప్పకుండ ఉంటారు. 80లలో మొదలుపెట్టిన అతని కెరీర్ ఇప్పటికీ అంతే ఎనర్జితో సాగుతుంది. శంకర్ జెంటిల్మన్ సినిమాతో తెలుగులో టాప్ హీరోల సాటిగా క్రేజ్ సంపాదించాడు. దానితో అప్పుడుప్పుడు తన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒకేఒక్కడు సినిమా ఎంతటి హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. డబ్బింగ్ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాలలో అతిది పాత్రలు కొన్ని సినిమాలలో కీలక పాత్రలు కూడా చేశారు.

ఇప్పుడు అర్జున్‌ కీలక పాత్రలో నటిస్తున్న తమిళ్ చిత్రం ‘నిబూనన్‌’ టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సినిమా దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌. ప్రసన్న, వైభవ్‌, వరలక్ష్మి ముఖ్య పాత్రధారులు. శ్రుతిహాసన్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘నిబూనన్‌’ అర్జున్‌ 150వ చిత్రం కావడం ఈ సినిమాకు మరోక ప్రత్యేకత. సీరియల్ కిల్లర్ నేపధ్యంగా సాగే కథలా అనిపిస్తుంది టీజర్‌ని చూస్తే. అర్జున్ యాక్షన్, కథలో కొత్తదనం కలిసి ఈ సినిమా పై అంచనాలు ఇప్పటికే పెరిగాయి. ఇందులో అర్జున్ ఒక క్రైమ్ స్పెషల్ ఆఫీసర్ గా చేస్తున్నారు

ఆ మధ్య రాఘవన్ అనే సినిమా సీరియల్ కిల్లర్ పై కమల్ హాసన్ ఒకటి చేశారు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో. ఈ సినిమా కూడా మంచి విజయం పొందింది. మరి ఇప్పుడు అర్జున్ నిబూనన్‌ ఎలాంటి కథనంతో ఆకట్టుకొంటారో చూడాలి.