Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బుస్ మనిపించే నాగిని వీ నెక్

By:  Tupaki Desk   |   16 April 2020 2:30 AM GMT
ఫోటో స్టోరీ: బుస్ మనిపించే నాగిని వీ నెక్
X
భారతదేశంలో అందాలకు కొదవలేదు.. అందులోనూ గ్లామర్ ఫీల్డ్ అనగానే ఎక్కడెక్కడి అందాల భామలందరూ సోషల్ డిస్టెన్సింగ్ మర్చిపోయి ముంబైలోనే మకాం వేస్తారు. అందాల వికేంద్రీకరణ కూడా ఉండదు. అలా ముంబైలో ఉండే ఎంతో మంది అందమైన భామలలో నియా శర్మ ఒకరు. ఓ దశాబ్దం నుంచి సీరియల్స్ .. రియాలిటీ షోస్ చేస్తూ టీవీ బుల్లితెర వీక్షకులలో భారీ ఫాలోయింగ్ సాధించింది. ఈ భామ ప్రస్తుతం నాగిన్- భాగ్య కా జెహ్రీలా ఖేల్ అనే యమా పాపులర్ సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తోంది. పనిలో పనిగా సోషల్ మీడియాను జింతాత 65 చేయడంలో బీకాంలో లాక్ డౌన్ కోర్స్ చేసింది.

సరే ఇలాంటి ఎం.కామ్ కెమిస్ట్రీ సంగతులు అన్నీ పక్కన పెడితే నియా శర్మ ఈ లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో తన మనసులోని భావాలను ఇన్స్టా వేదికగా సామాజిక మాధ్యమ తత్వవేత్తలతో పంచుకుంటోంది. ఓ రెండు కత్తిలాంటి ఫోటోలను వారి కోసం షేర్ చేసి "నా బీరువాలో బట్టలు నేను అసలు ఉన్నానా పోయానా అనుకుంటున్నాయేమో" అనే ఆసక్తికరమైన అనుమానం వెలిబుచ్చింది. నియా మనసులో వచ్చిన ఆలోచన 100% కరెక్ట్. ఇంట్లోనే కూర్చుని ఉన్నప్పుడు ఎంత అందమైన భామలు అయినా వీలైనంతవరకూ అప్పలమ్మలకు అసలు సిసలైన అక్కలుగా ఏదో ఒక డ్రెస్సు వేసుకుంటారు.. అంతే కానీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కార్పెట్ పై దుమ్మును ఊడ్చుకొని వచ్చినట్టు 20 మీటర్ల తోక ఉండే డ్రస్సులు వేసుకుని తిరగరు. అందుకే ఆ డ్రస్ లు అన్నీ ఇప్పుడు తెగ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాయి.

అవన్నీ పక్కన పెట్టి ఫోటోలో డ్రెస్ విషయానికి వస్తే ఓ పర్పుల్ కలర్ గౌన్ లో వయ్యారంగా రెండు పోజులిచ్చింది. ఇక వీ నెక్ ఉందే.. దాని గురించి మాట్లాడాలంటే ఓ కొత్త భాష అవసరమవుతుంది. ఆ టైలర్ ఎవరో గాని.. ఆయన ఓ ఫ్యాషన్ సైంటిస్ట్ అనే చెప్పాలి.. వీలైతే ఒక నోబెల్ బహుమతి.. కుదరకపోతే కొత్తగా గోబెల్ బహుమతి ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులను మనం గౌరవించకపోతే.. ఫ్యాషన్ సంప్రదాయాలు మరుగున పడిపోతాయి.ఈ ఫోటోలకు ఫుల్లుగా కామెంట్లు వచ్చాయి. "నువ్వు చావలేదు.. మమ్మల్ని చంపుతున్నావు".. "సూపర్ వీ నెక్".. "నియా మార్ దియా" అంటూ తమ స్పందనలు తెలిపారు.