Begin typing your search above and press return to search.

బాహుబలి-2 టిక్కెట్ల పేరుతో భారీ మోసం

By:  Tupaki Desk   |   25 April 2017 6:25 AM GMT
బాహుబలి-2 టిక్కెట్ల పేరుతో భారీ మోసం
X
ప్రజలకు బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను మోసాలకు వినియోగించుకుంటూ పోలీసులకు చిక్కింది ఓ ఆన్ లైన్ సంస్థ. టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించేలా సాఫ్ట్ వేర్ రూపొందించి.. దాని సహాయంతో ఆన్ లైన్లో టిక్కెట్‌ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్‌ నేరాల అధికారులు ఇదొక నకలీ సంస్థగా తేల్చారు. అయితే... అప్పటికే చాలామంది మోసపోయారు.

బాహుబలి-2 సినిమా టిక్కెట్ల విక్రయం కోసం కొత్తగా www.newtickets.in పేరిట ఒక వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేశారు హైదరాబాద్‌ తోపాటు అమెరికా - ఇంగ్లాండులోని కొన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు అందులో చూపిస్తోంది. సైట్‌ లోకి వెళ్లాక సినిమాహాళ్ల పేర్లన్నీ ప్రత్యక్షమవుతూ, సీట్లు కూడా కనిపిస్తున్నాయి. టిక్కెట్లు బుక్‌ చేసుకొని ఆన్‌ లైన్‌ ద్వారా డబ్బు చెల్లించగానే ఆ అంశాన్ని కన్ఫర్మ్ చేస్తూ వెంటనే ఫోన్‌ కు సందేశం వస్తుంది. ఒక్కో టిక్కెట్‌ రూ.120 చొప్పున అమ్ముతున్నారు.

అయితే.. హైదరాబాద్‌ లోని సినిమాహాళ్ల పేర్లన్నీ సైట్లో ఉండటం, ప్రతి ఆటకూ టిక్కెట్లన్నీ ఖాళీగా ఉండడంతో కొందరు అనుమానించి తెలంగాణ సీఐడీ సైబర్‌ నేరాల విభాగానికి కంప్లయింట్ చేశారు. వారు పరిశోధించి అది నకిలీదని తేల్చారు. థియేటర్ల యాజమాన్యాలు కూడా ఆ వెబ్ సైట్ తో తాము ఒప్పందాలు చేసుకోలేదని చెబుతున్నారు. దీంతో అందులో టిక్కెట్లు కొన్నవారంతా మోసపోయినట్లేనని పోలీసులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/