Begin typing your search above and press return to search.

సూపర్‌ ఫ్యాన్స్ రవీనా కోరిక.. గురూజీ వింటున్నారా?

By:  Tupaki Desk   |   25 April 2022 2:30 PM GMT
సూపర్‌ ఫ్యాన్స్ రవీనా కోరిక.. గురూజీ వింటున్నారా?
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే నెలలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక జూన్ లో మహేష్ బాబు తో త్రివిక్రమ్‌ సినిమా పట్టాలెక్కబోతుంది. వీరిద్దరి కాంబో మూవీ కోసం చాలా ఏళ్లుగా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

ఎట్టకేలకు వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం గా ఉన్నారు. జూన్ లో సినిమా ను పట్టాలెక్కించి చాలా తక్కువ సమయంలోనే షూటింగ్‌ ను ముగించి సినిమాను విడుదల చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా మరో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలా ను ఎంపిక చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందట.

ఇక త్రివిక్రమ్‌ ప్రతి సినిమాలో కూడా ఒక సీనియర్‌ హీరోయిన్ ను చూపిస్తాడు. అల వైకుంఠపురంలో టబు ను చూపించగా అంతకు ముందు కూడా పలువురు సీనియర్ స్టార్‌ హీరోయిన్స్ ను చూపించడం జరిగింది.

కనుక మహేష్ బాబు తో చేయబోతున్న సినిమా లో ఎవరిని చూపిస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు. ఈ సమయంలో అభిమానులు కొందరి పేర్లను త్రివిక్రమ్‌ కు సూచించే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో ప్రథానంగా కేజీఎఫ్ 2 సినిమా లో కీలక పాత్రలో కనిపించిన రవీనా టాండన్ ను మహేష్ బాబు సినిమా కోసం తీసుకోవాలంటూ త్రివిక్రమ్‌ కు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరిద్దరి కాంబో సినిమాలో ఆమె ఉంటే ఖచ్చితంగా సినిమా కు అదనపు ఆకర్షణ ఉంటుందంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ గారు.. గురూజీ అభిమానుల మాట కాస్త వినండి అంటూ అభిమానులు కొందరు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

కేజీఎఫ్ 2 లో రవీనా లుక్ తో పాటు ఆమె పాత్ర బాగుంది. ఆమెను సౌత్ లో మరిన్ని సినిమాల్లో చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే త్రివిక్రమ్‌ అయితే ఆమెకు సరిగ్గా మంచి పాత్రను ఇవ్వగలడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే రవీనా టాండన్ ను మహేష్ బాబు సినిమాలో అమ్మగానో అత్తగానో లేదా కీలక పాత్రలోనో నటింపజేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి త్రివిక్రమ్‌ ఆ విషయాన్ని కనీసం పరిగణలోకైనా తీసుకుంటాడా అనేది చూడాలి.