Begin typing your search above and press return to search.

'ఆచార్య' లో ఆమె.. కొరటాల శివ ఏమన్నాడంటే!

By:  Tupaki Desk   |   28 April 2022 9:30 AM GMT
ఆచార్య లో ఆమె.. కొరటాల శివ ఏమన్నాడంటే!
X
దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న మెగా ప్రాజెక్ట్‌ ఆచార్య సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కలిసి నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి పెంచే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగాయి. సినిమా విడుదలకు ముందుగానే నిర్మాతలకు కాసుల వర్షం కురిసిందని టాక్‌ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజల్‌ నటిస్తున్నట్లుగా మొదట ప్రకటించారు. ఆమె షూటింగ్‌ లో పాల్గొంది. షూటింగ్ కు కొత్తగా పెళ్లి అయ్యి భర్తతో వచ్చిన కాజల్‌ ను చిరంజీవి మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చిరు సత్కారం చేశారు. అయితే సినిమా లో చరణ్‌ పాత్ర పరిధి పెంచడంతో పాటు.. చిరంజీవి పాత్ర తీరు కారణంగా కాజల్‌ పాత్రను తొలగించినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

తాజాగా ఆచార్య సినిమా లో అనుష్క చిన్న పాత్రలో తళుక్కున మెరవబోతుందని.. రెండు రోజుల పాటు ఆచార్య షూటింగ్‌ లో అనుష్క పాల్గొంది అంటూ గత వారం పది రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. వాటన్నింటికి కూడా దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టాడు. ఆచార్యలో అరుంధతి లేదు అంటూ స్పష్టంగా కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో కొరటాల శివ ను ఆచార్య సినిమాలో అనుష్క నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానిపై స్పందన ఏంటీ అంటే అవన్నీ పుకార్లు మాత్రమే.. మా సినిమాలో అనుష్కను నటింపజేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అనుష్క మాత్రమే కాకుండా మరే స్పెషల్‌ అప్పియరెన్స్ ను కూడా సినిమాలో చూపించబోవడం లేదు అన్నట్లుగా కొరటాల శివ తెలియజేశాడు.

హీరోయిన్ గా అనుష్క సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. యూవీ క్రియేషన్స్ లో ఆమె తదుపరి సినిమా పట్టాలెక్కాల్సింది. ఇప్పటికే మహేష్ పి దర్శకత్వంలో సినిమా మొదలు అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా ఇతర కారణాల వల్ల సినిమా కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.

వచ్చే నెలలో ఆ సినిమా లో అనుష్క జాయిన్ కాబోతుందట. వరల్డ్‌ టాప్ మోస్ట్‌ చెఫ్ గా అనుష్క ఆ సినిమాలో కనిపించబోతుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు వెళ్లడవ్వాల్సి ఉంది.