Begin typing your search above and press return to search.

కాన్ఫిడెన్సా..ఓవ‌ర్ కాన్ఫిడెన్సా?

By:  Tupaki Desk   |   26 July 2022 6:00 AM IST
కాన్ఫిడెన్సా..ఓవ‌ర్ కాన్ఫిడెన్సా?
X
కాన్ఫిడెన్స్ కి..ఓవ‌ర్ కాన్ఫిడెన్సికి మ‌ధ్య చిన్న వ్య‌త్యాసం ఉంది. న‌మ్మ‌క‌మే మ‌నిషి జీవితం. కానీ అతిన‌మ్మ‌కం అదే జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంద‌న్న‌ది అంతే గ‌మనించాల్సి వాస్త‌వం. ఆ వ్య‌త్సాసాన్ని గ‌మ‌నించ‌కుంటే ఆర్డర్ మారిపోతుంద‌ని అనుభ‌వ‌జ్ఞ‌లు చెబుతుంటారు. ఓవ‌ర్ కాన్పిడెన్స్ తో బొక్క‌బోర్లా ప‌డిన జాబితా ఇండ‌స్ర్టీలో పెద్ద‌దే ఉంది.

ఇప్పుడిదంతా ఎందుకంటారా? ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు నెట్టింట ఇంత‌టి దుమారానికి రేపుతున్నాయి. అత‌నో యంగ్ మేక‌ర్. ప‌లు సినిమాల‌కు రైట‌ర్ గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇప్పుడా అనుభ‌వంతోనే ద‌ర్శ‌కుడిగా ట‌ర్న్ తీసుకున్నాడు. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో అత‌నికి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చాడు.

అత‌ని గ‌త ట్రాక్ చూసి ఈ ఛాన్స్ క‌ల్పించాడు. ఈ స్థాయికి రావ‌డానికి ఎంతో శ్ర‌మించాడ‌త‌ను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకోవ‌డంలో అత‌ని కృషి ప్ర‌శంసించ ద‌గ్గ‌దే. నేడు ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ అందుకోవ‌డం అంత వీజీ కాదు. కానీ అత‌ను త‌న ట్యాలెంట్ తోనే ఇంత వ‌ర‌కూ రాగ‌లిగాడు. రైట‌ర్ గా అత‌ని స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ ఇక్క‌డి వ‌ర‌కూ తీసుకొచ్చింది.

ఇప్పుడాయ‌న తెర‌కెక్కించిన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై కొంత నెగిటివిటీ స్ర్పెడ్ అవుతోంది. వాటికి బ‌ధులుగా ఓ వేడుక‌లో కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. కాక‌పోతే అందులో కాస్త అతి క‌నిపిస్తుంది. విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్ట‌డంలో త‌ప్పు లేదు. విమ‌ర్శ‌ల్ని ఎవ‌రూ స్వాగ‌తించ‌రు. కొంద‌రి ప్ర‌పంచంలో మాట‌కి మాట‌..దెబ్బ‌కి దెబ్బ అన్న స‌మాధాన‌మే క‌నిపిస్తుంది.

అదంతా ఎవ‌రి వ్య‌క్తిగ‌తం వారిది. కానీ ఆయ‌న రిలీజ్ కి ముందు స్పంధించే బ‌ధులు..రిలీజ్ త‌ర్వాత కౌంట‌ర్ వేసుంటే బాగుండేద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో డిస్క‌ష‌న్ కి వ‌స్తోంది.

ఎంతో బ్యాలెన్స్ గా వెళ్లాల్సిన ఇండ‌స్ర్టీలో ఆరంభంలోనే ఇలాంటి కౌంట‌ర్లు మ‌రో కోణానికి దారి తీసే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. ఓవ‌ర్ కాన్పిడెన్స్ తో కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయిన వారంద‌ర్నీ మ‌రోసారి నెమ‌రు వేసు కోవ‌డం విశ్లేష‌కుల పనైంది.