Begin typing your search above and press return to search.

భ‌ర్త కాళ్ల‌కు మొక్కి ఆశీస్సుల‌తో జ‌య‌మ్మ టికెట్ సేల్

By:  Tupaki Desk   |   2 May 2022 3:51 AM GMT
భ‌ర్త కాళ్ల‌కు మొక్కి ఆశీస్సుల‌తో జ‌య‌మ్మ టికెట్ సేల్
X
ఎక్క‌డ చీరాల‌కు వెళ్లినా జ‌య‌మ్మ పంచాయితీ మే 6 వ తారీఖు అని చెబుతున్నారు. చీరాల ఆడ‌ప‌డుచులు ప్ర‌త్యేకంగా రిలీజ్ తేదీని కూడా గుర్తు పెట్టుకున్నారు. ఆరోజు ఆడ‌ప‌డుచుల‌తో పాట అంద‌రూ థియేట‌ర్ల‌కు వ‌చ్చి మా సినిమాని ఆద‌రించాల‌ని కోరుతున్నాను! అన్నారు రాజీవ్ క‌న‌కాల‌.

మే 6న జ‌య‌మ్మ పంచాయితీ రిలీజ్ సంద‌ర్భంగా జ‌రిగిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో రాజీవ్ క‌న‌కాల తొలి టికెట్ ను కొనుక్కున్నారు. ఆడిటోరియంలో అభిమానులంతా 'జై సుమ‌క్క' అంటూ నిన‌దించారు. అభిమానుల కోలాహాలం చూస్తూ రాజీవ్ క‌న‌కాల ఏమ‌ని అడిగారంటే.. ''అంద‌రూ జై సుమ‌క్క అంటున్నారు ఎంతిచ్చారేమిటీ ఈవిడ‌?'' అంటూ త‌న‌దైన శైలిలో ఫ‌న్ క్రియేట్ చేస్తూ అంద‌రినీ న‌వ్వించారు.

ఇక ఇదే వేదిక‌పై సుమ ఎంతో జోష్ ఫుల్ గా క‌నిపించారు. తాను ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తొలి నాయికా ప్ర‌ధాన చిత్రం జ‌య‌మ్మ పంచాయితీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే ఆ ఎగ్జ‌యిట్ మెంట్ సుమ‌లో ఎంతో క‌నిపించింది. సీనియ‌ర్ యాంక‌ర్ గా ఎదురేలేని హ‌వా సాగిస్తున్న సుమ టాలీవుడ్ కోసం చేసిన సేవ‌లు అపారం. ద‌శాబ్ధాల పాటు ఈ రంగానికి ఫైనెస్ట్ యాంక‌ర్ గా సుమ సేవ‌లందించారు. ఇప్పుడు తాను లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌లో పెద్ద తెర‌పై క‌నిపిస్తుండ‌డం అభిమానుల్లోనూ ఎగ్జ‌యిట్ మెంట్ పెంచింది. మెగాస్టార్ చిరంజీవి స‌హా ఎంద‌రో ప్ర‌ముఖ హీరోలు సుమ న‌టించిన సినిమాకి ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని అంతా ఆకాంక్షిస్తున్నారు.

ఇక ఈ వేదిక‌పై సుమ స్కిట్ కూడా ఆద్యంతం న‌వ్వించింది. ''ఇంకొక ద‌ఫా మా ఇంటి చుట్టూ తిరిగినా నా కూతురితో మాట్లాడినా రెండు కాళ్లు విర‌గ్గొడ‌తాను కొండిగా'' అంటూ సుమ మూవీలో ఆ క్యారెక్ట‌ర్ పండించిన కుర్రాడితో స్కిట్ చేస్తూ బోలెడంత ఫ‌న్ ని జ‌న‌రేట్ చేసింది.

న‌టి యాంక‌ర్ ఆల్ రౌండ‌ర్ ..

సీనియ‌ర్ యాంక‌ర్ గా సుమ క‌న‌కాల ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. త‌నదైన అనుభ‌వంతో ఎలాంటి సినిమా వేడుక‌ను అయినా ర‌క్తి క‌ట్టించ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. ప్ర‌స్తుతం బుల్లితెర రియాలిటీ షోల‌ నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నారు. టీవీ షోల‌కు హోస్టింగ్ చేస్తూ తన భ‌ర్త రాజీవ్ తో క‌లిసి ప‌లు క్రేజీ షోల‌ను నిర్మిస్తున్నారు. ఇక సుమ అడ‌పాద‌డ‌పా తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ న‌టించారు. జ‌య‌మ్మ పంచాయితీతో సుమ కొత్త జ‌ర్నీ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. విజయ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లో సుమ పాత్ర తీరుతెన్నులు ఆక‌ట్టుకున్నాయి.

సుమ ప్ర‌స్థానం ఆస‌క్తిక‌రం:

టైమ్ చూసి టైమింగ్ లీ పంచ్ లు వేసే సుమ బుల్లితెర ప్ర‌స్థానం ఆస‌క్తిక‌రం. త‌న ప్రేమ పెళ్లి కూడా ఇంట్రెస్టింగ్. స్టార్ మహిళ- భలే ఛాన్సులే వంటి టీవీ కార్య‌క్ర‌మాల‌తో చ‌క్క‌ని పేరు తెచ్చుకుని..అటుపై దేవదాస్ కనకాల డైరెక్టర్ చేసిన మేఘమాల సీరియల్ లో న‌టించి.. అక్క‌డ ప‌రిచ‌య‌మైన డైరెక్టర్ కొడుకు రాజీవ్ కనకాలను సుమ ప్రేమించి పెళ్లాడారు. ఈ దంప‌తుల‌కు రోష‌న్ అనే కుమారుడు ఉన్నారు.