Begin typing your search above and press return to search.

లేట్ నైట్ పార్టీ కారణంగానే ఆ హీరోకి క్రేజీ ప్రాజెక్ట్ దూరమైందా..?

By:  Tupaki Desk   |   7 Nov 2022 1:30 PM GMT
లేట్ నైట్ పార్టీ కారణంగానే ఆ హీరోకి క్రేజీ ప్రాజెక్ట్ దూరమైందా..?
X
నెపోటిజం రాజ్యమేలే సినీ ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ రాణించడం మామూలు విషయం కాదనే మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలకు టాలెంట్ లేకపోయినా అవకాశాలు వస్తుంటాయని.. బ్యాగ్రౌండ్ లేకపోతే ప్రతిభావంతులు కూడా నిలదొక్కుకోలేరనే కామెంట్స్ మనం తరచుగా వింటుంటాం.

ఇలాంటి పరిస్థితుల్లోనూ పోటీని తట్టుకుని టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవుట్ సైడర్స్ ఉన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన ఓ యువ హీరో.. కేవలం తమ టాలెంట్ తోనే ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపతున్నాడు.

అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఆ హీరో.. తన వైఖరితో తరుచుగా వివాదాలతో సహవాసం చేస్తుంటాడు. తన ప్రమేయం ఉన్నా లేకున్నా సినిమా సినిమాకు ఏదొక కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు క్రమశిక్షణారాహిత్యం - నిబద్ధత లేని వాడనే ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు.

యంగ్ హీరో ఇటీవల ఓ సీనియర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సైన్ చేశాడు. దీని కోసం మంచి రెమ్యునరషన్ మాట్లాడుకొని అడ్వాన్స్ తీసుకున్నాడు. అంతా బాగానే వుంది.. సెట్స్ మీదకు వెళ్ళడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ వివాదంలో చిక్కుకొని ఆగిపోయింది.

ఇండస్ట్రీలో అనేక సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం.. అనౌన్స్ మెంట్ తర్వాత క్యాన్సిల్ అవడం చూసాం. కానీ ఇక్కడ హీరో అన్ ప్రొఫెషలిజం కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించడం అనేది హాట్ టాపిక్ గా మారింది.

హీరో మీద ఆరోపనలు చేసింది సాధారణ వ్యక్తి అయితే పరిస్థితి కూడా సాధారణంగా ఉండేదేమో. కానీ అతనో మంచి ఇమేజ్ ఉన్న సీనియర్ నటుడు. గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఇంతవరకూ అతనిపై ఒక్క వివాదం కూడా లేదు.

అలాంటి ఆయన ఇప్పుడు హీరోకి అసలు కమిట్మెంట్ లేదని.. దర్శక నిర్మాతలు అంటే గౌరవం లేదని పేర్కొన్నారు. అంతా సిద్దం చేసుకొని మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవుతుందనుకుంటుండగా.. షూటింగ్ క్యాన్సిల్ చేయమని కోరాడని చెప్పడంతో అందరి వేళ్ళు ఆ యువ హీరో వైపు చూపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ వివాదం మీద హీరో వివరణ ఇచ్చాడు. దీనికి కారణాలు తెలిపినప్పటికీ.. షెడ్యూల్ అంతా సిద్ధమైన తర్వాత రెండు మూడు గంటల ముందు షూటింగ్‌ ని రద్దు చేయమనడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీకి ఎక్కువకాలం ఉండాలంటే క్రమశిక్షణ కూడా చాలా అవసరమని సూచిస్తున్నారు.

అయితే ఆ రోజు షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకోమని సదరు హీరో కోరడం వెనుక వేరే రీజన్ ఉందని సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. షూటింగ్ కోసం ప్రిపేర్ అయిన హీరో.. ఓ లేట్ నైట్ పార్టీలో ఇరుక్కుపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

షూటింగ్ ముందు రోజు రాత్రి ఓ స్టార్ హీరో పార్టీకి యువ హీరో హాజరయ్యాడట. ఆ పార్టీ మూడ్‌ లో నెక్ట్ డే మార్నింగ్ వరకూ అక్కడే ఉండాల్సి వచ్చిందట. అందుకే ఉదయాన్నే ఫ్రెష్ గా సెట్స్ లో అడుగుపెట్టే శక్తి లేకపోవడంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయమని డైరక్టర్ ను కోరాడట.

అయితే హీరో వల్ల అప్పటికే రెండు సార్లు షూటింగ్ షెడ్యూల్ మార్చుకున్న ఆయన.. మూడోసారి షూట్ రద్దు చేయమని చెప్పడాన్ని ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు. ఈ నేథ్యంలోనే ఇలాంటి హీరోతో వర్క్ చేయలేనని నిర్ణయించుకొని.. అతన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించాలనే నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

నిజంగా బిగ్ హీరో ఇచ్చిన పార్టీ వల్లే ఇదంతా జరిగిందా? అసలు ఆ పార్టీలో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ వ్యవహారమంతా హీరోపై అనైతికతపై చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకూ సపోర్టు చేస్తూ వచ్చిన జనాలు కూడా ఈ విషయంలో హీరోని తప్పుబట్టే పరిస్థితి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.