Begin typing your search above and press return to search.

అమ్మడి పాత్ర పరిమితమైనా.. పారితోషికం మాత్రం పెద్దదే..!

By:  Tupaki Desk   |   4 Aug 2022 1:56 PM GMT
అమ్మడి పాత్ర పరిమితమైనా.. పారితోషికం మాత్రం పెద్దదే..!
X
టాలీవుడ్ లో ప్రెజెంట్ అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. చేతి నిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోందీ బ్యూటీ. అయితే ఇప్పుడు ''సీతా రామం'' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటి దాకా మెయిన్ హీరోయిన్ రోల్స్ చేస్తూ వచ్చిన రష్మిక.. తొలిసారిగా రెండో ప్రాధాన్యత పాత్రలో నటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'సీతా రామం' చిత్రంలో ఆఫ్రిన్ అనే ముస్లిం యువతిగా రష్మిక కనిపించనుంది.

అయితే ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ రూమర్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో ఆమెది పరిమిత పాత్ర ఉన్నప్పటికీ.. హీరోయిన్ రోల్ కోసం ఎంత తీసుకుంటుందో అంత మొత్తాన్ని పారితోషకంగా అందుకుందట.

ఫుల్ పేమెంట్ ఆఫర్ చేయడంతో పాటుగా ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో రష్మిక 'సీతా రామం' సినిమా చేయడానికి అంగీకరించిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ని బట్టి చూస్తే.. కథంతా నడిపించేది ఆమె పాత్రే అని తెలుస్తోంది.

లెఫ్టినెంట్ రామ్ రాసిన ఓ ఉత్తరాన్ని అందించడానికి సీతా మహాలక్ష్మి ని వెతుక్కుంటూ ఆఫ్రిన్ ఇండియాకి వచ్చినట్లు చూపించారు. ప్రధాన జంట మధ్య 1965 నాటి ప్రేమ కథను రష్మిక పాత్ర ద్వారా చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఆమెకు తరుణ్ భాస్కర్‌ సహాయం చేస్తూ కనిపించాడు.

'సీతా రామం' చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో స్వప్న సినిమాస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించారు. ఇదే సంస్థలో రష్మిక గతంలో 'దేవ దాస్' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. మరి ఇప్పుడు ఆఫ్రిన్ పాత్ర ఆమెకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

'సీతా రామం' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ మ్యాజికల్ లవ్ స్టోరీ కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూద్దాం.

ఇక రష్మిక విషయానికొస్తే.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతుంది. 'పుష్ప' తో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ.. త్వరలోనే స్టార్ట్ అవబోయే 'పుష్ప 2' సినిమాలో భాగం కానుంది. హిందీలో 'మిషన్ మజ్ను' - 'గుడ్ డే' మరియు 'యానిమల్' వంటి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అలానే 'వారసుడు' అనే బైలింగ్విల్ మూవీలో హీరోయిన్ గా కనిపించనుంది.