Begin typing your search above and press return to search.

ముందు నుయ్యి..వెనుక గొయ్యి..ఆ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి ఇలా!

By:  Tupaki Desk   |   2 Aug 2022 8:00 AM IST
ముందు నుయ్యి..వెనుక గొయ్యి..ఆ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి ఇలా!
X
ఒక్క హిట్ తో అయంగ్ డైరెక్ట‌ర్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ అయిపోయాడు.100 కోట్ల క్ల‌బ్ లో ఆ చిత్రం చేర‌డంతో అత‌ని రేంజ్ మారిపోయింది. టైర్ -2 హీరోల నుంచి టైర్ -1 హీరో ల‌కు ప్ర‌మోట్ అయ్యాడు. ఆ ఒక్క స‌క్సెస్ చూసి ఓ సూప‌ర్ స్టార్ దిగొచ్చాడు. మ్యాట‌ర్ ఉన్న ద‌ర్శ‌కుడ‌ని గుర్తించి త‌న‌తోనే సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించాడు.

త‌న ముందు ఉన్న‌ క‌మిట్ మెంట్ల‌ని సైతం ప‌క్క‌న‌బెట్టి మరి ఆ యంగ్ డైరెక్ట‌ర్ ని రంగంలోకి దించాడు. అంతే వేగంగా ఆప్రాజెక్ట్ ని పూర్తిచేసి ఇదే ఏడాది రిలీజ్ కూడా చేసారు. ఆసినిమా కూడా 100 కోట్ల క్ల‌బ్ చిత్ర‌మే. కానీ ఆ క‌థ ఆస్టార్ హీరో రేంజ్ కాద‌న్న‌ది వాస్త‌వం. క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వర్కౌట్ అయినా ఏదో అసంతృప్తి అభిమానుల్ని వెంటాడింది.

అయితే ఆ ప్రాజెక్ట్ ఆ స్టార్ చేయ‌డానికి ప్ర‌ధానం కార‌ణం డైరెక్ట‌ర్ రైటింగ్ స్టైల్..స్కిల్స్ న‌చ్చి చేసాడు అన్న‌ది వాస్త‌వం. ఈ సినిమా ఫ‌లితం విష‌యంలో హీరో కూడా హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఆ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి మాత్రం ఇప్పుడు ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా మారిందా? అంటే అవున‌నే వినిపిస్తుంది. సూప‌ర్ స్టార్ తో ఆ సినిమా చేసే ముందు స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఓ యంగ్ హీరోకి క‌థ చెప్పి ఒప్పించాడు.

త‌న గ‌త స‌క్సెస్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచుతుంద‌ని ఆ యంగ్ హీరో మ‌రో మాట లేకుండా ఒకే చెప్పేసాడు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలంటే? భ‌య‌ప‌డుతోన్న స‌న్నివేశం క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. అందుకే ఈ కార‌ణాలే సాక్ష్యా లుగా చెప్పొచ్చు. ఆ క‌మిట్ మెంట్ త‌ర్వాత ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కుల్ని తెర‌పైకి తీసుకొచ్చాడు ఆ యంగ్ హీరో.

ఇప్పుడు వాళ్ల‌తోనే రెండు చిత్రాలు మాత్ర‌మే చేయాల‌ని పట్టు మీద ఉన్నాడు. ఆ రకంగానే పావులు క‌దుపుతున్నాడు. దీంతో ముందు మాటిచ్చిన డైరెక్ట‌ర్ ఇప్పుడు ఆ హీరో రేసులో వెనుక‌బ‌డిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. తాజా స‌న్నివేశం నేప‌థ్యంలో ఆ డైరెక్ట‌ర్ కూడా ఇది వ‌ర్కౌట్ కాద‌ని ఓ అభిప్రాయానికి వ‌చ్చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇంకెన్నాళ్లు అత‌ని చుట్టు తిరుగుతాం..ఇక్క‌డితే ఆ విష‌యాన్ని వ‌దిలేసి ఫ్రెష్ గా ముందుకెళ్దామ‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడా డైరెక్ట‌ర్ ప‌రిస్థితి ఎలా ఉంది? అంటే ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగానే మారింది. రెండు పెద్ద స‌క్సెస్ ల త‌దుప‌రి స్టార్ హీరోతోనే సినిమా చేయాల‌న్న ఓ కండీష‌న్ ఉంది.

ఇప్పుడా ఆ ఇమేజ్ నుంచి డైరెక్ట‌ర్ బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. అగ్ర హీరోలంతా బిజీగా ఉన్నారు. ఇప్ప‌ట్లో డేట్లు కేటాయించే అవ‌కాశం ఎంత మాత్రం లేదు. అలాగని ఇప్పుడున్న రేంజ్ ని త‌గ్గించుకుని టైర్ -2..3 హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి ముందుకు రాలేని ప‌రిస్థితి. దీంతో ఆ డైరెక్ట‌ర్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగుతోంది.