Begin typing your search above and press return to search.

'ఆచార్య' ఆ విష‌యంలో త‌గ్గితే బాగుంటుందేమో?

By:  Tupaki Desk   |   5 May 2022 2:30 PM GMT
ఆచార్య ఆ విష‌యంలో త‌గ్గితే బాగుంటుందేమో?
X
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం 'ఆచార్య‌' ఇటీవ‌ల భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ మూవీలో మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. దాదాపు చిరు సినిమా కోసం రెండేళ్లు నిరీక్షించిన అభిమానుల‌కు తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది. బ్లాక్ బ‌స్ట‌ర్స్ డైరెక్ట‌ర్ గా ట్రాక్ రికార్డ్ వున్న కొర‌టాల శివ నుంచి ఈ రేంజ్ సినిమాని ఊహించ‌ని అభిమానులు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే.

ఇదిలా వుంటే ఈ మూవీ ఈ శుక్ర‌వారం రెండ‌వ వారంలోకి ఎంట‌ర్ కాబోతోంది. ఏప్రిల్ 29న విడుద‌లైన ఈ మూవీ గురువారంలో ఫ‌స్ట్ వీక్ ని పూర్తి చేసుకుంది. శుక్ర‌వారం రెండ‌వ వారంలోకి అడుగుపెడుతోంది. ఇప్ప‌టికే సినిమా టాక్ కార‌ణంగా చాలా ఏరియాల్లో ఆడియ‌న్స్ క్రౌడ్ చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.

బ‌య్య‌ర్లు కూడా చేతులు ఎత్తేసిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. కార‌ణం మే 12 వ‌ర‌కు మ‌రో పెద్ద సినిమా రిలీజ్ లేదు. ఈ టైమ్ ని ఆచార్య వ‌సూళ్ల‌ని పెంచేందుకు వాడుకోవ‌చ్చు. తెలివిగా ఏదైనా ప్లాన్ చేసి వుండాల్సింది అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ విడుద‌ల స‌మ‌యంలో తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్ర‌భుత్వం మూడు రోజుల పాటు టికెట్ రేట్ల‌ను పెంచుకోవ‌చ్చ‌ని ప్ర‌త్యేకంగా జీవోని కూడా విడుద‌ల చేసింది. దీంతో హైద‌రాబాద్ లాంటి మెట్రో న‌గ‌రాల్లో ఆచార్య టికెట్ రూ.400 చేశారు. రెండ‌వ వారంలోకి ఎంట‌ర్ కానున్న నేప‌థ్యంలో ఈ చిత్ర టికెట్ రేట్ల‌ని రూ. 250కి త‌గ్గించారు.

అయితే ఈ శుక్ర‌వారం విశ్వ‌క్ సేన్ న‌టించిన 'అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం', యాంక‌ర్ సుమ న‌టించిన 'జ‌య‌మ్మ పంచాయితీ' విడుద‌ల కాబోతున్నాయి, ఈ చిత్రాల కోసం వెళ్లే ప్రేక్ష‌కులు రూ.250 టికెట్ వున్న 'ఆచార్య‌'కు వ‌స్తారా? అన్న‌ది ఇప్పుడు వినిపిస్తున్న వాద‌న‌.

ఇప్ప‌టికే ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ఆచార్య‌' స్ట్రీమింగ్ కానుందంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ టికెట్ ప్రైజ్ ని రూ.150 నుంచి రూ.100 త‌గ్గించి వుంటే బాగుంటేద‌ని, ఇలా చేస్తే మ‌రింత మంది ఈ సినిమాని చూడ‌టానికి ఇష్ట‌ప‌డేవార‌ని, దాంతో సినిమా క‌లెక్ష‌న్ లు భారీగా పెరిగేవ‌ని, ఈ విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్లు ఎందుకు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.