Begin typing your search above and press return to search.

తారక్ తో యాడ్ అంటే ఆ మాత్రం ఉంటది మరి..!

By:  Tupaki Desk   |   14 May 2023 12:02 AM IST
తారక్ తో యాడ్ అంటే ఆ మాత్రం ఉంటది మరి..!
X
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీర్లో ఎన్టీఆర్ ఒకరు. ఆయన నటన, డ్యాన్స్, కామెడీ టైమింగ్ ఇలా ఒకటేంటి..? ఆయన ఏది చేసినా అద్భుతమే. కేవలం నటన కోసమే పుట్టినట్లుగా ఉంటాడు. కేవలం కళ్లతో కూడా ఎక్స్ ప్రెషన్ పండించగల గొప్ప నటుడు. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోస్తాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆ చిత్రంలోని ఓ పాటకు ఆస్కార్ లాంటి గొప్ప ఘనత కూడా దక్కింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగా ప్రజలు ఫిదా అయిపోయారు. ఇప్పటికే బాలివుడ్ లో సినిమాకి ఆయన సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వార్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా సాగనుంది.

మరో వైపు ఆయన ఎన్టీఆర్ 30 కోసం శ్రమిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మే 20న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ టైటిల్ తో పాటు, ఆ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఈ సంగతి పక్కన పెడితే తారక్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన ఓ ఇంటర్నేషనల్ కంపెనీ కి సంబంధించిన యాడ్ లో నటిస్తున్నారట. అందుకుగాను ఆ సంస్థ నుంచి భారీ పారితోశకం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బ్రాండ్ మెక్ డొనాల్డ్స్‌ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఆయన అంగీకరించారు.

దీంతో మెక్ డోనాల్డ్స్ ఎన్టీఆర్ తో ఓ భారీ ప్రకటన చేయడానికి ప్లాన్ చేస్తోందట. ప్రస్తుం యాడ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రకటన చేసింనందుకు గాను ఆయన భారీ మొత్తంల పారితోషకం అందుకున్నారట. ఆయన కెరీర్ లో ఓ ప్రకటనకు ఇంత మొత్తం రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి అని సమాచారం. షూట్ పూర్తైన తర్వాత, ఈ కమర్షియల్ యాడ్ ని త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ చేసే అవకాశం ఉందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో ఎన్టీఆర్ తో ప్రకటన చేయాలంటే ఆ మాత్రం ఉంటది మరి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆయన ఓ టీవీ షోకి హోస్ట్ గా కూడా చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడ ఈటీవీలో జరిగే ప్రోగ్రాం అని సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇంకా బయటకు రాలేదు.