Begin typing your search above and press return to search.

స్వీట్ 16 లా క‌నిపించినా 34 బాస్!

By:  Tupaki Desk   |   4 May 2022 2:30 AM GMT
స్వీట్ 16 లా క‌నిపించినా 34 బాస్!
X
'చిరుత'తో ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ నేహా శ‌ర్మ కెరీర్ టాలీవుడ్ లో ఆశించినంత‌గా సాగ‌లేదు. తొలి సినిమా స‌క్సెస్ అయినా అమ్మ‌డికి అవ‌కాశాలు ఆశించిన విధంగా రాలేదు. రామ్ చ‌ర‌ణ్ సినిమా త‌ర్వాత 'కుర్రాడు'లో న‌టించింది. అక్క‌డ నుంచి నేరుగా ఎక్క‌డి నుంచైతే వ‌చ్చిందో అక్క‌డికే వెళ్లిపోయింది. అప్ప‌టి నుంచి హిందీ సినిమాల‌కే ప‌రిమిత‌మైంది. అక్క‌డ అవ‌కాశాలైతే వ‌చ్చాయి గానీ స్టార్ హీరోయిన్ కాలేక‌పోయింది.

అజ‌య్ దేవ‌గ‌ణ్ లాంటి స్టార్ల హీరోల్లో సినిమాల్లో న‌టించిన అమ్మ‌డు ఫేమ‌స్ కాలేక‌పోయింది. మ‌ధ్య‌లో త‌మిళ్..మ‌ల‌యాళం సినిమాల్లోనూ న‌టించింది. కానీ ఏ భాష‌లోనూ నేహ కెరీర్ సాపీగా సాగేలేదు. దాదాపు రెండు ద‌శాబ్ధాల సినీ ప్ర‌యాణంలో అన్ని ఒడిదుడుకులే. దీంతో నేహా వ‌యసు మీద ప‌డింది. చూడ‌టానికి స్వీట్ 16 లా కనిస్తుంది గానీ ప్ర‌స్తుతం వ‌య‌సు 34. ఈనేప‌థ్యంలో ప్రాక్టిక‌ల్ గా సాధ్య‌మ‌య్యే వాటిపైనే దృష్టి నిలిపింది.

బాలీవుడ్ లో ఏజ్ బార్ హీరోల స‌ర‌స‌న న‌టించ‌డం మొద‌లు పెట్టింది. బాలీవుడ్ లో దీప‌క్ దొబ్రియో...న‌వాజుద్దీన్ సిద్దిఖ్ లాంటి వాళ్ల‌తో జ‌త క‌ట్టింది. ప్ర‌స్తుతం న‌వాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న 'జోగిరా సారా రారా' లో న‌టిస్తుంది. ఇది రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో సిద్ద‌క్ తో ఇంటిమేట్ స‌న్నివేశాల్లో నేహా హ‌ద్దు మీరుతుంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఇప్పుడు ఇదే ఊపులో అమ్మ‌డు మ‌ళ్లీ టాలీవుడ్ అవ‌కాశాల‌పైనా దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించ‌డానికి రెడీగా ఉంద‌ని వినికిడి . ఇప్ప‌టికే కొన్ని ఒప్పందాలు చేసుకున్న‌ట్లు గుసగుస వినిపిస్తుంది. అయితే ఆ సీనియ‌ర్ హీరోలు ఎవ‌రు? అన్న వివరాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

అయితే నేహాశ‌ర్మ ఇలాంటి నిర్ణ‌యం ప‌ట్ల కొంత మంది ఫ్యాన్స్ అసంతృప్తిగా క‌నిపిస్తున్నారు. అప్పుడే ఏజ్ బార్ హీరో ప‌క్క‌న ఏంటి? అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ త‌ప్ప‌దు. అయినా నేహాశ‌ర్మ వ‌య‌సు చిన్న‌దేం కాదు. చూడ‌టానికి స్వీట్ 16 లా క‌నిపించినా 34 మీద ప‌డ్డాయి. కాబ‌ట్టి స‌రైన స‌మ‌యంలో మంచి నిర్ణ‌య‌మే తీసుకుంద‌న్న‌ది కొంత మంది అభిప్రాయం.

టాలీవుడ్ లో చిరంజీవి...బాల‌కృష్ణ‌..నాగార్జున‌...మోహ‌న్ బాలు లాంటి వారికి హీరోయిన్ల ఎంపిక మేక‌ర్స కి ఇబ్బందిగానే ఉంది. మ‌రి నేహా లాంటి బ్యూటీల వ‌ల్ల కొంత వ‌ర‌కూ ఆ ఇబ్బంది త‌ప్పుతున్న‌ట్లే.