Begin typing your search above and press return to search.

అక్క‌డ గంగూబాయి దే హ‌వా

By:  Tupaki Desk   |   28 April 2022 2:30 AM GMT
అక్క‌డ గంగూబాయి దే హ‌వా
X
బాలీవుడ్ లో వున్న క్రేజీ హీరోయిన్ ల‌లో టాప్ మోస్ట్ క్రేజీ లేడీ అలియా భ‌ట్‌. మ‌హేష్ భ‌ట్ వార‌సురాలిగా సినిమాల్లోకి ప్ర‌వేశించినా త‌న‌దైన న‌ట‌నతో న‌టిగా త‌న‌ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్‌, టై స్టేట్స్‌, క‌పూర్ అండ్ స‌న్స్, ఉడ్తా పంజాబ్‌, రాజీ, గ‌ల్లీ బాయ్ వంటి చిత్రాల‌తో నటిగా తన‌కు తిరుగులేదు అనిపించుకుంది. ఇటీవ‌ల 'ట్రిపుల్ ఆర్' చిత్రంతో తెలుగులోనూ ప‌రిచ‌యమై మంచి మార్కులు కొట్టేసింది.

రాజమౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ 1100 కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాక్సాఫీస్ వద్ద విజ‌య విహారం చేస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. హిందీలోనూ ఈ చిత్రానికి రికార్డు స్థాయి వ‌సూళ్లు ద‌క్కిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే అలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా ప్ర‌స్తుతం యుఎస్ లో అరుదైన ఘ‌న‌త‌ని సాధించింది. అలియాభ‌ట్ న‌టించిన చిత్రం 'గంగూబాయి క‌తియావాడీ'. సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ఈ మూవీని ముంబై రెడ్ లైట్ ఏరియాలో సంచ‌ల‌నం సృష్టించిన గంగూబాయి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించాయి.

మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రిలీజ్ టైమ్ లో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన 'గంగూబాయి క‌తియావాడీ' ప్ర‌స్తుతం యుఎస్ లో ప్రేక్ష‌కులని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

దేశ వ్యాప్తంగా హిందీతో పాటు తెలుగులోనూ విడుద‌లైన ఈ చిత్రం 130 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అలియా భ‌ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీగా విడుద‌లైన ఈ చిత్రం అలియా స్టార్ డ‌మ్ ని మరోసారి నిరూపించింది. ప్ర‌స్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్ర‌సారం అవుతోంది.

గంగూబాయి పాత్ర‌లో అలియాభ‌ట్ న‌ట‌న‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి. నెట్ ఫ్లిక్స్ లోని టాప్ టెన్ యుఎస్ ట్రెండ్స్ లిస్ట్ లో ఈ మూవీ కూడా వుండ‌టం విశేషం. హాలీవుడ్ చిత్రాలు మాత్ర‌మే టాప్ టెన్ యుఎస్ ట్రెండ్స్ లిస్ట్ లో వుంటుంటాయి. అలాంటి జాబితాలో గంటూబాయి కూడా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.