Begin typing your search above and press return to search.

సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరేదెలా?

By:  Tupaki Desk   |   2 May 2022 4:33 AM GMT
సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరేదెలా?
X
ప్రేమ ఎంత మ‌ధురం.. ప్రియురాలు అంత క‌ఠినం! ఈ పాట‌కు యాప్ట్ గా కొంద‌రు భామ‌లు ఉంటారు. ప్రేమించేప్పుడు ఉన్న కిక్కు పెళ్లితో ద‌క్కించుకునే వ‌ర‌కూ స‌న్నివేశం వెళ్ల‌దు. ఆ కోవ‌లో చూస్తే సుశాంత్ సింగ్ తో డేటింగ్ చేసిన ప్ర‌ముఖ స్టార్ కిడ్ సారా అలీఖాన్ తొలి వైఫ‌ల్యాన్ని చ‌వి చూసింద‌ని సుశాంత్ ఫ్యాన్స్ ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

కేదార్ నాథ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సారా అలీఖాన్ ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే సుశాంత్ సింగ్ అందం న‌ట‌న‌లో గ్రేస్ కి ప‌డిపోయింది. అత‌డితో కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేసింది ఈ ప‌టౌడీ సంస్థాన వార‌సురాలు. కానీ అంత‌లోనే స‌న్నివేశం మారిపోయింది. సుశాంత్ సింగ్ ని బ్యాడ్ డేస్ త‌రుముకొచ్చాయి. లైఫ్ లో చేసిన కొన్ని త‌ప్పులు అత‌డి విధిని శాసించాయి. ముఖ్యంగా డ్ర‌గ్స్ కి బానిస కావ‌డం వ‌రుస త‌ప్పిదాలు అత‌డిని అంద‌రాని లోకాల‌కు తీసుకెళ్లింద‌ని అభిమానులు ఇప్ప‌టికీ న‌మ్ముతారు. స్టార్ వ‌ర‌ల్డ్ లో గొప్ప న‌టుడిగా వెల‌గాల్సిన అత‌డు అర్థాంత‌రంగానే అంత‌ర్ధాన‌మ‌య్యాడు. అది ఆత్మ‌హ‌త్య‌నో లేక ఇంకేదో ఇప్ప‌టికీ ఏ ద‌ర్యాప్తు సంస్థా నిర్ధారించ‌లేదు. విచార‌ణ సాగుతూనే ఉంది.

అయితే ఇన్నాళ్ల త‌ర్వాత త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ ని గుర్తు చేసుకుంది సారా అలీఖాన్. ఆ ర‌కంగా అతడిని తాను పూర్తిగా మ‌ర్చిపోలేద‌ని చెప్ప‌క‌నే చెప్పింది. ప్రస్తుతం ఖోపోలీ షూటింగ్ లో ఉన్న సారా అలీ ఖాన్ కి జీవితం ఒక‌ పూర్తి వృత్తం అని అర్థ‌మ‌వుతోంద‌ట‌. యువ తార తన తొలి చిత్రం `కేదార్ నాథ్` చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి కొన్ని భాగాలను రాయ్ గడ్ జిల్లాలో చిత్రీకరించారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ చోటుకి రావాలనే వ్యామోహం కలిగిందట సారాకి. ప్రస్తుతం ఖోపోలీలో గ్యాస్ లైట్ చిత్రీకర‌ణ‌లో ఉన్న సారా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అక్కడ తన అనుభవాన్ని ప్రేక్షకులకు వెల్ల‌డించింది.

సారా అలీ ఖాన్ గ్యాస్ లైట్ కోసం ఖోపోలీలో చిత్రీకరణ చేస్తున్నప్పుడు కేదార్‌నాథ్ జ్ఞాపకాలను మళ్లీ సందర్శించారు. సూర్యుని ఉద‌యం తర్వాత‌ షూట్.. అస్త‌మ‌యం త‌ర్వాత ఈత.. సారాకు ఇష్టమైనవి. S లు … త్రోబ్యాక్ టు కేదార్‌నాథ్ షూట్ డేస్ అనే పోస్ట్ ను షేర్ చేసింది సారా. ఇందులో ఎస్ అంటే సుశాంత్ సింగ్ ఎస్ అంటే సారా అలీఖాన్ అన్న‌మాట‌. అందుకే ఎస్-లు అని వ్యాఖ్యానించింది.

కేదార్‌నాథ్ చిత్రంతో సారా అలీ ఖాన్ దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్ ఇప్పుడు పవన్ కృపలాని దర్శకత్వం లో తాజా చిత్రంలో సంప్రదాయేతర అమ్మాయి పాత్రతో త‌న‌ని తాను ఆవిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

సారా అలీఖాన్ ఐదేళ్ల త‌ర్వాత సుశాంత్ ని మ‌ళ్లీ గుర్తు చేసుకుంద‌ని.. అత‌డి మ‌ర‌ణం స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిల‌వ‌లేద‌ని అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మ‌కు శాంతి లేకుండా పోయింది!.. అంటూ బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. కొన్ని డేటింగులు ఇలానే ఉంటాయ‌ని కూడా కౌంట‌ర్లు వేస్తున్నారు. కేసు విచార‌ణ‌లో భాగంగా సారా అలీఖాన్ డ్ర‌గ్ అడిక్ష‌న్ గురించి సుశాంత్ తో ప్రేమాయ‌ణం గురించి ఎన్.సి.బి ప్ర‌శ్నించింది. ఆ క్ర‌మంలోనే సుశాంత్ తో తాను డేటింగ్ చేసాన‌ని ప్రేమించాన‌ని కూడా సారా అంగీక‌రించింది. ఒక‌సారి క‌లిసి విదేశీ వెకేష‌న్ కి వెళ్లామ‌ని తెలిపింది. కానీ ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రి మ‌ధ్యా దూరం పెరిగింది.