Begin typing your search above and press return to search.

ఆసక్తి రేకెత్తిస్తున్న 'దూత'.. మరి థ్యాంక్యూ చెప్పేది ఎప్పుడు బ్రదర్‌?

By:  Tupaki Desk   |   29 April 2022 5:45 AM GMT
ఆసక్తి రేకెత్తిస్తున్న దూత.. మరి థ్యాంక్యూ చెప్పేది ఎప్పుడు బ్రదర్‌?
X
అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిచిన 'థ్యాంక్యూ' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే ఏ సినిమా మేకర్స్ అయినా కూడా విడుదల హడావుడి మొదలు పెడతారు. కాని థ్యాంక్యూ విషయంలో అది కనిపించడం లేదు. కాని అదే హీరో మరియు దర్శకుడు నాగ చైతన్య మరియు విక్రమ్‌ కె కుమార్‌ లు మాత్రం 'దూత' పనిలో పడ్డారు.

అమెజాన్ ప్రైమ్‌ కోసం వీరిద్దరు కలిసి చేస్తున్న 'దూత' వెబ్‌ సిరీస్ గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు అమెజాన్ వారు వెబ్‌ సిరీస్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. దూత వెబ్‌ సిరీస్ షూటింగ్ చక చక జరుగుతోంది. అందుకు సంబంధించిన స్టిల్స్ ను విడుదల చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను టైటిల్‌ తో సహా రివీల్‌ చేయడం తో అతి త్వరలోనే దూత వచ్చే అవకాశాలు ఉన్నాయని వెళ్లడి అయ్యింది.

తాజాగా అమెజాన్ అధికారికంగా బయటకు వదిలిన దూత స్టిల్స్ అక్కినేని ఫ్యాన్స్ ను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. హీరోగా ఇప్పటి వరకు నాగ చైతన్య చాలా విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు.

కాని మొదటి సారి దూత వెబ్‌ సిరీస్ కోసం నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. దూత వెబ్‌ సిరీస్ లోని ఆయన లుక్‌ చాలా కూల్‌ అండ్‌ డిఫరెంట్‌ గా ఉండటంతో అందరి అంచనాలు పెరుగుతున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ వారు రాబోయే ఆరు నెలల కాలంలో భారీ ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఖచ్చితంగా దూత ఈ మద్య కాలంలో వస్తుందని తెలుస్తోంది. తెలుగు తో పాటు సౌత్‌ అన్ని భాషల్లో కూడా దూత ను డబ్బింగ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వెబ్‌ సిరీస్ తో నాగ చైతన్య హిందీ ప్రేక్షకులకు కూడా చేరువయ్యే అవకాశం ఉంది.

ఒక వైపు దూత పనులు హడావుడిగా జరుగుతున్నాయి. ఫస్ట్‌ లుక్ లు.. స్టిల్స్ విడుదల అవుతున్నాయి. కాని థ్యాంక్యూ సినిమా సందడి మాత్రం కనిపించడం లేదు. సాదారణంగా దిల్ రాజు విడుదల విషయంలో చాలా పక్కా ప్లాన్ తో ఉంటాడు. కనుక థ్యాంక్యూ విడుదల విషయంలో ఆయన ప్లాన్‌ ఏమై ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. థ్యాంక్యూ విడుదల విషయంలో క్లారిటీ కోసం అక్కినేని ఫ్యాన్స్‌ వెయిటింగ్‌.